Divya Agarwal: నటుడితో బ్రేకప్.. ఆ సమయంలో ఓదార్చిన వ్యక్తితో లవ్.. నటి ఇంట్రెస్టింగ్ స్టోరీ..
దివ్య అగర్వాల్.. ఓటీటీ బిగ్ బాస్ విజేతగా నిలిచిన ఈమె బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీల్లో ఎంతో సక్సెస్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం చికాగుగా మారింది.

Divya Agarwal: సినీ రంగంలో ప్రేమ పెళ్లిళ్లు.. ఆ తరువాత బ్రేకప్ లు కామన్. అయితే పెళ్లికి ముందు ఎంతో హడావుడి చేసి.. పెళ్లిని ప్రముఖుల మధ్య చేసుకున్న వీరు ఎంతో కాలం కలిసి ఉండలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలతోనే మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. లేటేస్టుగా ఓ జంట ఇలాగే విడిపోయింది. అయితే ఇలాంటి సమయంలో ఎవరికైనా బాధగానే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఒంటరిగా ఫీలై తీవ్రంగా కుంగిపోతారు. ఈ సమయంలో తనను ఓదార్చిన వారిని హత్తుకోవాలని ఉంటుంది. అలా ఓదార్చిన వ్యక్తి.. ఇప్పుడు తనకు భర్తగా మారిపోతున్నాడు. ఆసక్తికరమైన ఈ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకోండి.
దివ్య అగర్వాల్.. ఓటీటీ బిగ్ బాస్ విజేతగా నిలిచిన ఈమె బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీల్లో ఎంతో సక్సెస్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం చికాగుగా మారింది. గతంలో వరుణ్ సూద్ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దివ్య అగర్వాల్ ఆ తరువాత అతనికి దూరమైంది. గతేడాది ఆయనకు టాటా చెప్పింది. వరుణ్ సూద్ తో బ్రేకప్ చెప్పిన తరువాత దివ్యా అగర్వాల్ తీవ్రంగా కుంగిపోయింది. తన హృదయం ముక్కలయ్యేంత పని జరిగిందని చెప్పింది.
ఇలాంటి సమయంలో తనకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు అపూర్వ పడ్ గోయెంకర్. ఈయన ఓ రెస్టారెంట్ అధిపతి. దివ్య బాధను చూడలేక ఆమెకు అండగా ఉండానుకున్నాడు. వరుణ్ తో బ్రేకప్ అయిన తరువాత ఆమెను గోవాలోని ఓ టెంపుల్ కు తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండాలని చెప్పాడు. అలా తన తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకొని మరోసారి కన్నీళ్లు పెట్టింది దివ్య.
కానీ అపూర్వ ఆమెను దగ్గరకు తీసుకొని ఓదర్చాడు. వరుణ్ తో నువ్వు విడాకులు తీసుకోవడం మంచిదే అయింది.. లేకుంటే మీ గొడవలు ఇంకా కొనసాగివి.. అని చెప్పాడు. మొత్తానికి ఆ విషాద ఘటన నుంచి దివ్యను బయటపడేశాడు. ఈ క్రమంలో అపూర్వపై దివ్యకు మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆది కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజుల కిందట వీరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.ఆపద సమయంలో ఆదుకున్నావాడే నిజమైన స్నేహితుడు అన్నట్లు.. తాను బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వ్యక్తే తనకు దేవుడిలా కనిపించాడని దివ్య అంటోంది.
