Niharika Konidela – Chaitanya Divorce: నిహారికతో విడాకులు… స్పష్టత ఇవ్వనున్న వెంకట చైతన్య?
Niharika Konidela – Chaitanya Divorce: నిహారిక-వెంకట చైతన్య విడిపోతున్నారంటూ గత 24 గంటలుగా కథలు వెలువడుతున్నాయి. దీనికి వారిద్దరి సోషల్ మీడియా బిహేవియర్ కారణమైంది. భర్త వెంకట చైతన్యను నిహారిక ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. వెంకట చైతన్య సైతం భార్యను అన్ ఫాలో అయ్యారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. అలాగే నిహారికతో తన స్వీట్ మెమోరీస్ మొత్తం చెరిపేశారు. ప్రస్తుతం వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ అకౌంట్లో […]


Niharika Konidela – Chaitanya Divorce
Niharika Konidela – Chaitanya Divorce: నిహారిక-వెంకట చైతన్య విడిపోతున్నారంటూ గత 24 గంటలుగా కథలు వెలువడుతున్నాయి. దీనికి వారిద్దరి సోషల్ మీడియా బిహేవియర్ కారణమైంది. భర్త వెంకట చైతన్యను నిహారిక ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. వెంకట చైతన్య సైతం భార్యను అన్ ఫాలో అయ్యారు. ఆయన ఇంకో అడుగు ముందుకేసి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశారు. అలాగే నిహారికతో తన స్వీట్ మెమోరీస్ మొత్తం చెరిపేశారు. ప్రస్తుతం వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ అకౌంట్లో నిహారికకు సంబంధించిన ఒక్క ఫోటో మాత్రమే ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో వెంకట చైతన్య, నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలపై ఇరు వర్గాల్లో ఎవరూ స్పందించలేదు. దీంతో సస్పెన్స్ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం నిహారికతో విడాకుల పుకార్లపై వెంకట చైతన్య స్పందించనున్నారట. ఆయన స్వయంగా స్పష్టత ఇవ్వనున్నారట. దీంతో నిహారికతో ఆయన రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటని తెలియనుందట. గొడవలు నిజమేనా లేక ఇవన్నీ గాలి వార్తలేనా అనేది తేలిపోనుంది.
మరోవైపు విభేదాలు నిజమే… చిరంజీవి రంగంలోకి దిగారని. వెంకట చైతన్య కుటుంబంతో మాట్లాడి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇద్దరినీ తిరిగి కలిపే ప్రయత్నాలు చేస్తున్నారని ఓ వాదన తెరపైకి వచ్చింది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. స్పష్టమైన సమాచారం లేదు. కేవలం సోషల్ మీడియాలో నిహారిక-వెంకట చైతన్య ఒకరినొకరు అన్ ఫాలో కావడం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో పుకార్ల మొదలయ్యాయి.

Niharika Konidela – Chaitanya Divorce
గుంటూరుకు చెందిన వెంకట చైతన్య తండ్రి పోలీస్ అధికారి. ఆయన చిరంజీవి ఫ్యామిలీ ఫ్రెండ్ అని సమాచారం. ఆ సాన్నిహిత్యం రీత్యా ఈ సంబంధం కుదిరింది. వెంకట చైతన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. 2020 డిసెంబర్ 9న నిహారిక-వెంకట చైతన్యల వివాహం జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదు రోజులు ఈ పెళ్లి నిర్వహించారు. మెగా హీరోలందరూ పాల్గొన్న నిహారిక పెళ్లి నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది.