Divi Vadthya: దివి అందాల ఆరబోత.. చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ ఫొటోలు

దివికి పాపులారిటీ తెచ్చింది మాత్రం బిగ్ బాస్ షో. 2020లో ప్రసారమైన సీజన్ 4లో దివి కంటెస్టెంట్ చేసింది. హౌస్లో తనదైన గేమ్ తో ఆకట్టుకుంది. దివి అఫైర్స్ కి దూరంగా ఉంది.

  • Written By: SRK
  • Published On:
Divi Vadthya: దివి అందాల ఆరబోత.. చెమటలు పట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ ఫొటోలు

Divi Vadthya: బాలీవుడ్ భామలకు ఏమాత్రం తగ్గని రూపం దివి వాద్య సొంతం. ఈ పొడుగు సుందరికి కమర్షియల్ హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి. కానీ రావాల్సిన స్థాయిలో గుర్తింపు రావడం లేదు. దివి కెరీర్ బిగినింగ్ లో స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఆ చిత్రాలు దివికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మహర్షి చిత్రంలో ఓ పాత్ర చేసింది. మహేష్ బాబు క్లాస్ మేట్ గా ఆమె కనిపించారు. మహేష్ తో ఆమెకు కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయి.

అయితే దివికి పాపులారిటీ తెచ్చింది మాత్రం బిగ్ బాస్ షో. 2020లో ప్రసారమైన సీజన్ 4లో దివి కంటెస్టెంట్ చేసింది. హౌస్లో తనదైన గేమ్ తో ఆకట్టుకుంది. దివి అఫైర్స్ కి దూరంగా ఉంది. అలాగే ఆమె అగ్రెసివ్ గేమ్ ఆడలేదు. సాఫ్ట్ గా ఉండేవారు. ఇంటి సభ్యులు అందరితో కలవకపోవడం ఆమెకు మైనస్ అయ్యింది. అమ్మ రాజశేఖర్ తో దివి స్నేహం చేసింది. ఈ కారణాలతో దివి జర్నీ ఎక్కువ వారాలు సాగలేదు. ఆ సీజన్ విన్నర్ గా అభిజీత్ నిలిచాడు.

ఫైనల్ కి చేరకున్నా దివికి ఫేమస్ అయ్యింది. ఆమె ఓ హీరోయిన్ అనే విషయం జనాలకు తెలిసింది. అనంతరం ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తున్నాయి. వెబ్ సిరీస్లు, చిత్రాల్లో కీలక రోల్స్ దక్కుతున్నాయి. క్యాబ్ స్టోరీస్, ఏటిఏం వంటి సిరీస్లలో దివి నటించారు. గత ఏడాది మంచు విష్ణు హీరోగా విడుదలైన జిన్నా చిత్రంలో దివి కీలక రోల్ చేయడం విశేషం. హీరో చిన్నప్పటి ఫ్రెండ్ గా ఆమె అలరించారు. ఈ సినిమాలో దివి మూగ అమ్మాయిగా కనిపించడం విశేషం.

అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ రోల్ చేసింది. దివి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీలో దివి రిపోర్టర్ రోల్ చేస్తుంది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన ”వేర్ ఈజ్ పుష్ప?” టీజర్లో దివి ప్రధానంగా కనిపించారు. దివికి ఈ సినిమా బ్రేక్ ఇచ్చే సూచనలు కలవు. అలాగే మరికొన్ని చిత్రాలు, సిరీస్లకు ఆమె సైన్ చేసినట్లు సమాచారం.

మరోవైపు ఇంస్టాగ్రామ్ వేదికగా దివి హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంటారు. దివికి ఇంస్టాగ్రామ్ లో వన్ మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు దివి ఫోటోలు ఉంటాయి. దివి గ్లామర్ చూస్తే టాలీవుడ్ ఆమెను గుర్తించడం లేదనే సందేహం కలుగుతుంది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు తెలుగు అమ్మాయిలు నచ్చరు. దాని వలన దివి లాంటి అమ్మాయిలు నష్టపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Instant Telugu (@instanttelugu)

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు