Bigg Boss Divi: దివి వాద్యా అంటే టక్కున ఎవరూ గుర్తుపట్టక పోవచ్చుగానీ.. బిగ్ బాస్ దివి అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా ఫేమస్ అయిపోయింది ఈ బ్యూటీ. స్వతహాగా తెలుగు అమ్మాయి అయిన దివికి టాలీవుడ్ లో పెద్దగా ఛాన్సులు రాలేదు. మోడల్ గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీకి.. లెట్స్ గో, సీన్ నెంబర్ 72 లాంటి సినిమాల్లో నటించింది.

Divya Vadthya
అయితే ఆమె కెరీర్‌కు అవి పెద్దగా ఉపయోగపడలేదు. ఈ క్రమంలోనే మహర్షి లాంటి పెద్ద సినిమాలో కీలక పాత్ర వచ్చింది. ఆ మూవీలో ఆమె నటనకు బాగానే మార్కులు పడ్డాయి. కానీ అవేవీ పెద్దగా ఆమెకు హీరోయిన్‌గా ఛాన్సులు తేలేకపోయాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అక్కడకు వెళ్లి ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయింది.
తన ఆటతో బాగానే పాపులర్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది బిగ్ బాస్ అనే చెప్పుకోవాలి. ముక్కుసూటిగా ఉంటూ.. నిజాయితీగా ఆడటంతో ఆమెను అంతా సపోర్టు చేశారు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇప్పుడు కొన్ని వెబ్ సిరీస్ లతో పాటు చిన్న సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.

Bigg Boss Divi
ఇక సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాతో తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తన ఘాటైన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర పట్టనివ్వట్లేదు. తాజాగా స్విమ్మింగ్ ఫూల్‌లో దిగిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఇందులో ఆమె తడిచిన అందాలతో మాయ చేసిందనే చెప్పాలి. ఈ సొట్టబుగ్గల అందాలన్నీ ఈ ఫొటోల్లో క్లియర్ గా కనిపిస్తున్నాయి.
Recommended Videos: