BJP Bandi Sanjay: ‘బండి’ని టార్గెట్ చేసిన ఆ వర్గం.. తెలంగాణ బీజేపీకి బీటలు..?

BJP Bandi Sanjay: తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీకి అప్పుడే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీలోని ఓ వర్గం అసమ్మతి వ్యక్తం చేయడంతో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులు.. తమకు ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్నారట.. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రహస్య మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలిసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. […]

  • Written By: NARESH ENNAM
  • Published On:
BJP Bandi Sanjay: ‘బండి’ని టార్గెట్ చేసిన ఆ వర్గం.. తెలంగాణ బీజేపీకి బీటలు..?

BJP Bandi Sanjay: తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీకి అప్పుడే అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. పార్టీలోని ఓ వర్గం అసమ్మతి వ్యక్తం చేయడంతో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకులు.. తమకు ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్నారట.. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రహస్య మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయం తెలిసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీనియర్ల సమాధానం కోసం అధిష్టానం ఎదురుచూస్తోందట.. అయితే బీజేపీకి అంతో ఇంతో బలం ఉన్న కరీంనగర్ నియోజకవర్గంలోనే ఈ ధిక్కార స్వరాలు రావడం ఆసక్తి రేపుతోంది.

Also Read:

Also Read:

తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది. 2018 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకున్న కమలం పార్టీ ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగుస్థానాల్లో విజయం సాధించింది. అయితే కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అయిన తరువాత పరిస్థితి మారిపోయింది. అప్పటి వరకు ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు ఉన్న బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్ సీట్లు గెలుచుకుంది. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో పార్టీగా అవతరించింది.

Also Read:  వారానికో నేత‌ను చేర్చుకుంటారంట‌.. వారిపైనే చంద్ర‌బాబు ఆశ‌లు..

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా చక్రం తిప్పుతున్నారు. అయితే ఇదే జిల్లా నుంచి సీనియర్ నేతలు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ముఖ్యంగా బండి సంజయ్ ను టార్గెట్ చేసుకొని సీనియర్లంతా ఒక్కటయ్యారు. రహస్య మీటింగ్ పెట్టుకొని చర్చించుకున్నారు. అయితే అసంతృప్త నేతలతో మాట్లాడే బాధ్యతను బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డికి అప్పగించారు. దీంతో వారిని హైదరాబాద్ పిలిపించారు. అయితే ఆ తరువాత వారి ధిక్కార స్వరం అక్కడితో ఆగిపోలేదు. సీనియర్లంతా ఒక్కొక్కరు మీడియా ముందుకు వస్తున్నారు. లోపల ఏం జరగుతుందో అన్నీ చెప్పేస్తున్నారు. తమకు షోకాజ్ నోటీసులిస్తే సమాధానం చెబుతామని అంటున్నారు.

కరీంనగర్ జిల్లాలో బీజేపీకి ఎప్పటి నుంచో పట్టుంది. గతంలో విద్యాసాగర్ రావు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గుజ్జుల రామకృష్ణారెడ్డి ధిక్కార స్వరం వినిపించేవారు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలుండేవి. 2014 ఎలక్షన్ల సమయంలో పార్టీ బండి సంజయ్, రామకృష్ణారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయింది. 2014, 2018 ఎన్నికల్లో బండి సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అందుకు గుజ్జుల రామకృష్ణారెడ్డియే కారణమని ఓ ఆరోపణ. అయితే 2019లో బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తరువాత అనూహ్యంగా అతనికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ పటిష్ట స్థాయికి చేరుతోంది.

ఈ సమయంలో బీజేపీలో పలు కమిటీలను నియమించారు. అయితే ఇందులో రామకృష్ణారెడ్డి వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. అప్పటి నుంచి బండి సంజయ్ ను రామకృష్ణారెడ్డి టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కలిసివచ్చే తెలంగాణ బీజేపీ సీనియర్లను ఆయన ఒక గూటికి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రామకృష్ణారెడ్డి వర్గం ఆర్ఎస్ఎస్ కు ఫిర్యాదు కూడా చేసింది. అయితే బండి సంజయ్ కూడా ఎంపీగా పోటీ చేసిన సమయంలో తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ల లిస్టు తయారు చేస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్న బీజేపీకి బీటలు వారే ప్రమాదముందా..? అని కింది స్థాయి నాయకులు చర్చించుకుంటున్నారు.

Also Read: హిందీ తెర పై ‘రంగ‌స్థ‌లం’.. సుకుమారే డైరెక్టర్ ?

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు