Dimple Hayathi: వివాదంతో వెలుగులోకి వచ్చిన డింపుల్ హయాతీ బాగోతం… అతడితో సహజీవనం!
రాహుల్ హెగ్డే ట్రాఫిక్ డీసీపీగా ఉన్నారు. తన అధికారాన్ని ఉపయోగించి నన్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని డింపుల్ హయాతీ ఆరోపిస్తున్నారు.

Dimple Hayathi: డింపుల్ హయాతీ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతుంది. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డేతో ఆమెకు ఏర్పడిన వివాదం హాట్ టాపిక్ గా ఉంది. పార్కింగ్ లో ఉన్న రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టడంతో పాటు డింపుల్ కాలితో తన్నారని ఆమెపై అభియోగం మోపారు. దీనికి సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేయగా అందులో డింపుల్ కోపంగా కాలితో అక్కడున్న కోన్స్ ని తన్నినట్లుగా ఉంది. డింపుల్, ఆమె మిత్రుడు డేవిడ్ విక్టర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
రాహుల్ హెగ్డే ట్రాఫిక్ డీసీపీగా ఉన్నారు. తన అధికారాన్ని ఉపయోగించి నన్ను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతుందని డింపుల్ హయాతీ ఆరోపిస్తున్నారు. తర్వలో నిజాలు బయటికి వస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టులో నడుస్తుంది. ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న రాహుల్ హెగ్డే-డింపుల్ మధ్య మనస్పర్థలు ఉన్నాయని తెలుస్తుంది. డింపుల్ హయాతీ కారుకు ఆయన పలుమార్లు చలానాలు వేశాడట. రాహుల్ ఉద్దేశపూర్వకంగా డింపుల్ కారుకు చలానా విధించారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం కారణంగా డింపుల్ హయాతీ సీక్రెట్ ఒకటి రివీల్ అయ్యింది. ఆమె బాయ్ ఫ్రెండ్ తో పాటు ఒకే అపార్ట్మెంట్ లో కలిసి ఉంటున్నారన్న విషయం బయటపడింది. డింపుల్ హయాతీపై గతంలో ఎలాంటి ఎఫైర్ వార్తలు రాలేదు. డేవిడ్ విక్టర్ అనే వ్యక్తితో కలిసి జీవిస్తున్న సంగతి వెలుగులోకి వచ్చింది. చాలా కాలంగా వీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారని సమాచారం అందుతుంది.
ఈ మధ్య పెళ్ళికి ముందే సహజీవనం కామన్ అయిపోయింది. కొందరు గర్భం కూడా దాల్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఇలియానా ఇలానే తల్లి అయ్యారు. ఇలియానా తనను గర్భవతిని చేసిన వ్యక్తి ఎవరో కూడా చెప్పలేదు. ఇక శృతి హాసన్ కూడా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారు. హైదరాబాద్ కి చెందిన డింపుల్ నచ్చిన వ్యక్తితో హ్యాపీగా ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. ఇక డింపుల్ హయాతీ కెరీర్ ఆశాజనకంగా లేదు. ఆమె నటించిన ఖిలాడీ, రామబాణం డిజాస్టర్స్ అయ్యాయి.