మహిళల భద్రత కోసం.. ప్రత్యేక వాట్సప్ నెంబర్..

  హైద్రాబాద్ లో దిశ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీస్ యంత్రాంగం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహిళల భద్రత కోసం షీ టీం ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం వాట్సప్ నెంబర్ 94416 69988ను ఆవిష్కరించారు. మహిళలు ఈ వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదులు పంపితే…పోలీసులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ నెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న […]

  • Written By: Raghava
  • Published On:
మహిళల భద్రత కోసం.. ప్రత్యేక వాట్సప్ నెంబర్..

 

హైద్రాబాద్ లో దిశ ఘటన తర్వాత మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీస్ యంత్రాంగం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మహిళల భద్రత కోసం షీ టీం ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసింది. ఇందు కోసం వాట్సప్ నెంబర్ 94416 69988ను ఆవిష్కరించారు. మహిళలు ఈ వాట్సప్ నెంబర్‌కు ఫిర్యాదులు పంపితే…పోలీసులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఈ నెంబర్ రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉమెన్‌ సేఫ్టీ వాట్సాప్‌ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చామని షీ టీం ఐజీ స్వాతి లక్రా తెలిపారు.

హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో ఐపీఎస్‌ అధికారిణి సుమతి, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ పి.శ్రావణ్‌కుమార్‌, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్‌ నాగమణిలతో కలిసి ఉమెన్‌ సేఫ్టీ వాట్సాప్‌ నంబరు- 94416 69988ను స్వాతిలక్రా ఆవిష్కరించారు. ఈ నంబరుకు కేవలం వాట్సాప్‌ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోల వివరాలే పంపాలని సూచించారు. మహిళల భద్రత కోసం తెలంగాణ వ్యాప్తంగా త్వరలోనే పబ్లిక్‌ సేఫ్టీ క్లబ్బులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు