Adipurush 2nd weekend Collections : 2 వ వీకెండ్ లోను డిజాస్టర్ వసూళ్లు..’ఆదిపురుష్’ ఇక క్లోసింగ్ కి వచేసినట్టే!

ఇప్పటి వరకు ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.  రాబొయ్యే రోజుల్లో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

  • Written By: Vicky
  • Published On:
Adipurush 2nd weekend Collections : 2 వ వీకెండ్ లోను డిజాస్టర్ వసూళ్లు..’ఆదిపురుష్’ ఇక క్లోసింగ్ కి వచేసినట్టే!

Adipurush 2nd weekend Collections : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన  సంగతి అందరికీ తెలిసిందే. శ్రీ రాముడి చరిత్ర ని అపహాస్యం చేసారని, ఇది వాల్మీకి రాసిన రామాయణం అసలు కాదని నార్త్ ఇండియన్స్ కూడా దండయాత్ర చేసారు. ఎంతో అద్భుతమైన ఎమోషన్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ ఓం రౌత్ సెకండ్ హాఫ్ మొత్తాన్ని గాలికి వదిలేసాడని, 3D వెర్షన్ ఉంది కాబట్టి మొదటి మూడు రోజులైనా భారీ వసూళ్లు వచ్చాయని, లేకుంటే ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

మొదటి మూడు రోజులు తర్వాత నాల్గవ రోజు నుండి ఈ సినిమాకి దారుణంగా వసూళ్లు పడిపోయాయి. బ్రేక్ ఈవెన్ మార్కు కి చాలా దూరం లో ఉండడం తో ఇక ఈ సినిమాకి భారీ నష్టాలు తప్పవని అందరూ అనుకున్నారు.

కానీ ఈ వీకెండ్ అయినా వసూళ్లు కలిసొస్తాయని ఆశపడ్డారు మేకర్స్. కానీ ఈ వీకెండ్ లో కనీసం ఒక్క చోట కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డు పడకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దరిదాపుల్లో ఒక్క పేరున్న సినిమా కూడా లేదు, కేవలం ఆదిపురుష్ చిత్రం తప్ప రాబొయ్యే రోజుల్లో కూడా ఒక్క స్టార్ హీరో సినిమా లేదు.

పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం విడుదల అవ్వడానికి కూడా నెల రోజులకు పైగానే సమయం ఉంది. అయ్యినప్పటికీ కూడా ఆదిపురుష్ కి జనాలు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదంటే, ఈ చిత్రానికి బయట ఏ రేంజ్ నెగటివ్ టాక్ ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటి వరకు ఈ చిత్రానికి 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.  రాబొయ్యే రోజుల్లో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు