Daggubati Abhiram : డైరెక్టర్ తేజ నన్ను అందరి ముందు తిట్టాడు?
షూటింగ్ జరుగుతున్నప్పుడు తేజ అందరి ముందు మైక్ లో నన్ను తిట్టారు. నీ బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ నేను ఆడియన్స్ కోసమే సినిమా తీస్తాను. దృష్టి పెట్టి నటించు కేకలు వేశారు.

Daggubati Abhiram : దగ్గుబాటి వారసుడిగా అభిరామ్ వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన హీరోగా అహింస టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుండగా హీరో అభిరామ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
దగ్గుబాటి అభిరామ్ మాట్లాడుతూ … ఓసారి డైరెక్టర్ తేజ నాన్నకు కథ చెప్పారు. ఈ కథ నన్ను లాంచ్ చేయడానికి చక్కగా సరిపోతుందని నాన్న భావించారు. అలా అహింసా మూవీ అయ్యింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు తేజ అందరి ముందు మైక్ లో నన్ను తిట్టారు. నీ బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ నేను ఆడియన్స్ కోసమే సినిమా తీస్తాను. దృష్టి పెట్టి నటించు కేకలు వేశారు. హీరోయిన్ ని ఎత్తుకొని నేను పరుగెత్తే సన్నివేశం ఉంది. నేను ముందుకు పడిపోయాను. మోకాళ్ళకు దెబ్బలు తగిలాయి.
ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. సినిమా పూర్తి అయ్యాక బాబాయ్(వెంకీ) అన్నయ్య(రానా)లకు సినిమా చూపించాను. వారు చిన్న చిన్న మార్పులు చెప్పారు. మూవీ విడుదల దగ్గర పడే కొద్దీ కంగారు ఎక్కువైంది. రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు.
మరో ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీడియా అనేక ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉంది. వారికి ఏం సమాధానం చెబుతారని అడగ్గా… నేను ఈ తప్పు చేయలేదు. కాబట్టి ఎలాంటి ప్రశ్ననైనా ఫేస్ చేయగలను. ప్రస్తుతం నా దృష్టి మొత్తం సినిమాపైనే ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
శ్రీరెడ్డి అప్పట్లో అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు విడుదల చేశారు. అభిరామ్ తో తనను లైంగికంగా వాడుకున్నాడని ఆమె ఆరోపణలు చేశారు. శ్రీరెడ్డి వ్యవహారంలో అభిరామ్ పేరు ప్రముఖంగా వినిపించింది. శ్రీరెడ్డి వివాదంపై మీడియా ఆయన్ని ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ లో అహింస తెరకెక్కింది. ఆర్ఫీ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు.
