Sandeep Reddy Vanga: టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని తనవైపు మార్చుకునేలా చేశారు సందీప్ రెడ్డి. ఈ డైరెక్టర్ ఒక్క సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఇటు విజయ్ దేవరకొండకు… డైరెక్టర్ సందీప్ రెడ్డికి టాలీవుడ్ బాలీవుడ్ లో మార్కెట్ పెరిగిందనే చెప్పాలి. “అర్జున్ రెడ్డి” తెలుగులో విజయం అందుకున్న తర్వాత అన్ని భాషల్లో రీమిక్ చేయగా… అక్కడ కూడా విజయం సాధించింది. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో “కబీర్ సింగ్” గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సందీప్ రెడ్డి. ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రంతో బాలీవుడ్ లో సందీప్ రెడ్డి కి క్రేజ్ పెరిగింది అని చెప్పుకోవాలి.
ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సందీప్. అలానే రెబల్ స్టార్ ప్రభాస్ తో “స్పిరిట్ ” అనే చిత్రాన్ని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకి ప్రభాస్ రూ.150 కోట్లు పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. హీరోకి అంత రెమ్యునేషన్ ఇస్తుంటే డైరెక్టర్ కి కూడా బాగానే ముట్టజెప్పి ఉంటారనే అనుకోగా… రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో యాభై శాతం వాటాలు వచ్చేలా డీల్ కుదుర్చుకున్నారట సందీప్.
అందులోనూ ప్రభాస్ సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది. మరి స్క్రిప్ట్ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తున్నారు సందీప్ రెడ్డికి అని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఈ కథ ఎలా ఉంటుందో. ప్రస్తుతం ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ చిత్రాల్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. వాటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ చేయనున్నారు. వీటన్నిటి తర్వాత ‘స్పిరిట్’ను తెరకెక్కిస్తారా లేదా షూటింగ్ షెడ్యూల్ మారుస్తారా అనేది సస్పెన్స్ గా ఉంది. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం.