Anni Manchi Sakunamule Review: ‘అన్నీ మంచి శకునములే’ మూవీ ఫుల్ రివ్యూ
నందిని రెడ్డి మొదటి నుండి తన సినిమాలను ఫీల్ గుడ్ మూవీస్ లాగ తియ్యడం అలవాటు. ఈ సినిమాని కూడా అలాగే తియ్యాలని చూసింది. కానీ స్లో స్క్రీన్ ప్లే వల్ల ఆడియన్స్ చాలా సన్నివేశాలకు బోరింగ్ ఫీల్ అవుతారు.

Anni Manchi Sakunamule Review: నటీనటులు : సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్ , నరేష్ , వెన్నెల కిషోర్, రావు రమేష్ , గౌతమీ తదితరులు.
దర్శకత్వం : నందిని రెడ్డి
సంగీతం : మిక్కీ జె మేయర్
నిర్మాత : ప్రియాంక దత్
విభిన్నమైన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న దర్శకురాలు నందిని రెడ్డి. ఆమె దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్ హీరో గా నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమా నుండి కాస్త డిఫరెంట్ కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు సంతోష్ శోభన్. కానీ గత కొంతకాలం నుండి ఈయన సినిమాలు ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా జనాలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే ఈసారి మాత్రం నందిని రెడ్డి లాంటి దర్శకురాలితో పని చెయ్యడం, దానికి తోడు టీజర్, ట్రైలర్ మరియు పాటలు కి మంచి రెస్పాన్స్ రావడం తో ఈ చిత్రం పై మార్కెట్ లో బజ్ ఏర్పడింది.నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
కథ :
ఈ చిత్రం కథ రెండు కుటుంబాల మధ్య జరుగుతుంది.రిషి(సంతోష్ శోభన్) కుటుంబానికి పెద్ద ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) కాగా, ఆర్య(మాళవిక నాయర్) కుటుంబానికి పెద్ద సుధాకర్(నరేష్). వీళ్ళ తాతల నుండి చెందాల్సిన కాఫీ ఎస్టేట్ పంపకం విషయం లో మొదటి నుండి గొడవలు పడుతూ వస్తుంటారు.వీళ్లిద్దరి మధ్య ఇన్ని గొడవలు ఉన్నప్పటికీ రిషి మరియు ఆర్య మంచి స్నేహితులుగా మెలుగుతారు. వీళ్ళ స్నేహం మరియు ప్రేమ ఈ రెండు కుటుంబాల మధ్య వైరాన్ని పెంచిందా, లేదా రెండు కుటుంబాలను కలిసిపోయేలా చేసిందా అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
నందిని రెడ్డి మొదటి నుండి తన సినిమాలను ఫీల్ గుడ్ మూవీస్ లాగ తియ్యడం అలవాటు. ఈ సినిమాని కూడా అలాగే తియ్యాలని చూసింది. కానీ స్లో స్క్రీన్ ప్లే వల్ల ఆడియన్స్ చాలా సన్నివేశాలకు బోరింగ్ ఫీల్ అవుతారు. కానీ కొన్ను కామెడీ సీన్స్ మరియు ఎమోషనల్ సీన్స్ ని చాలా చక్కగా రాసుకుంది, కానీ అదే జోరు సినిమా మొత్తం కొనసాగించి ఉండుంటే బాగుండేది అనిపించింది.మరో పక్క మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అయ్యింది. ఇక సంతోష్ శోభన్ నటన ముందు సినిమాలకంటే చాలా ఇంప్రూవ్ అయ్యినట్టు అనిపించింది. ఇది వరకు ఆయన పోషించిన పాత్రలే ఇందులో కూడా చేసాడు, కానీ ఈ చిత్రం లో ఆయన పాత్ర ని సరికొత్తగా చూపించడం తో ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది.
ఇక మాళవిక నాయర్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసే టాలెంట్ ఆమె సొంతం ,ఈ చిత్రం లో కూడా అలాగే చేసింది. ఇక సపోర్టింగ్ కాస్ట్ రాజేంద్ర ప్రసాద్ మరియు నరేష్ ఈ చిత్రానికి ఆయువు పట్టు లాంటి వాళ్ళు. ఫస్ట్ హాఫ్ ఎక్కడా కూడా బోర్ కొట్టదు, చాలా ఫన్నీ గా సాగిపోతుంది.కానీ సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ చేసినట్టు అనిపించింది.కానీ నందిని రెడ్డి మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు.అయితే ఇలాంటి సినిమాలకు ఊపిరి లాంటిది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే విషయం లో మిక్కీ జె మేయర్ చేతులెత్తేశారు.దానికి తోడు స్లో స్క్రీన్ ప్లే కూడా ఉండడం తో ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులకు యావరేజి అనిపిస్తుంది.
చివరిమాట : కాసేపు టైం పాస్ కోసం ఎంజాయ్ చెయ్యాలి అనుకునే వాళ్లకు ఈ వీకెండ్ ఈ చిత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.సినిమా చాలా స్లో గా ఉంటుంది కానీ, కొన్ని కామెడీ సన్నివేశాలు , ఎమోషనల్ సన్నివేశాల కోసం ఒకసారి తప్పకుండ చూడవచ్చు .
రేటింగ్ : 2.5/5