Krishna vamsi – Prabhas : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రభాస్ సినిమా.. టైటిల్ ఇదే !

Krishna vamsi – Prabhas : నేషనల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. అందుకే.. ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో సంచలనానికి నాంది పలకబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో  ప్రభాస్  ఓ సినిమా చేయబోతున్నాడు.  ‘అన్నం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా  ‘పాన్ ఇండియా రేంజ్ సినిమా.    ఇది ఒక హై వోల్టేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా  అట.  గతంలో ప్రభాస్ […]

  • Written By: SRK
  • Published On:
Krishna vamsi – Prabhas : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో  ప్రభాస్ సినిమా..  టైటిల్ ఇదే !

Krishna vamsi – Prabhas : నేషనల్ స్టార్ ప్రభాస్ కి ప్రస్తుతం 300 కోట్లు మార్కెట్ ఉంది. అందుకే.. ప్రభాస్ చేతుల్లో దాదాపు అరడజను పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో సంచలనానికి నాంది పలకబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో  ప్రభాస్  ఓ సినిమా చేయబోతున్నాడు.  ‘అన్నం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా  ‘పాన్ ఇండియా రేంజ్ సినిమా.    ఇది ఒక హై వోల్టేజ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామా  అట.  గతంలో ప్రభాస్ తో  చక్రం సినిమా చేశాడు కృష్ణవంశీ. Krishna Vamsi

చక్రం సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఫీల్ గుడ్ సినిమాగా నిలిచిపోయింది.  అందుకే.. కృష్ణవంశీతో  సినిమా చేయడాన్ని ప్రభాస్ కూడా  బాగా ఎంజాయ్ చేస్తాడు.  పైగా కృష్ణవంశీ తనకు గురువులాంటి వ్యక్తి అని ప్రభాస్  ఓ సందర్భంలో అన్నాడు.   అసలు టాలీవుడ్ లో  ‘క్రియేటివ్ డైరెక్టర్’  అన్న మాటకు  కృష్ణవంశీ అనే  పేరు  ‘మారు పేరు’.   తన ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శించే దార్శనిక  దర్శకుడు కృష్ణవంశీ. 
 
కృష్ణవంశీ  కెరీర్ లో సక్సెస్ లు ప్లాప్ లు ఉండవు. అద్భుతమైన కథలు, బలమైన పాత్రలు మాత్రమే ఉంటాయి.  అందుకే, కృష్ణవంశీ ఎప్పుడూ  సక్సెస్ ఫుల్ డైరెక్టరే.  తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి  కథలు రాయడం  కృష్ణవంశీ కు షాట్ తో పెట్టిన విద్య.  ముఖ్యంగా  సమకాలీన సమస్యలకు తగిన పరిష్కారం చూపించడం  కృష్ణవంశీకు ఆలోచనతో అబ్బిన  నైజం.  కృష్ణవంశీ తన ‘గులాబీ’ సినిమా నుంచే.. కథకు విలువ ఇచ్చిన దర్శకుడు.
Prabhas With Disaster Director

Prabhas

  
ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం  ‘రంగమార్తాండ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  పైగా  తన సినీ కెరీర్ లోనే  ఈ సినిమాని కృష్ణవంశీ చాలా స్పెషల్ గా తీసుకున్నాడు.  అందుకే, ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా రెట్టింపు ఆసక్తి ఉంది.  ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన జంటగా,  సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యువ హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ యువ జంటగా కనిపిస్తారు.  అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తోంది.  
 
ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనసూయ  పాత్ర చాలా బలమైనదట, కృష్ణవంశీ ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. మొత్తమ్మీద ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు  సాధారణ ప్రేక్షకులు కూడా…  ఈ క్రియేటివ్ డైరెక్టర్ తో  ప్రభాస్ త్వరగా  సినిమా చేయాలని కోరుకుంటున్నారు