Director Anil Sharma On NTR: ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు .. ఆ సత్తా బాలీవుడ్ లో ఎవరికి లేదు.. గదర్ 2 డైరెక్టర్ వైరల్ కామెంట్స్
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు సునామీ సృష్టిస్తుంది. 22 సంవత్సరాల తర్వాత సీక్వెల్ వచ్చిన కానీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న సన్నీ, అమీషా మధ్య కెమిస్ట్రీ గురించి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

Director Anil Sharma On NTR: దాదాపు 2 దశాబ్దాల క్రితం వచ్చిన సినిమాకు స్వీకెల్ తీయడం అనేది పెద్ద సాహసమే అని చెప్పాలి. అలా తీయటమే కాకుండా దానిని సూపర్ హిట్ గా తెరకెక్కించి భారీ హిట్ కొట్టడం మామూలు విషయం కాదు. దాన్ని సాధ్యం చేశాడు గదర్ 2 దర్శకుడు అనిల్ శర్మ. 2001 లో వచ్చిన గదర్ కు స్వీకెల్ గా తెరకెక్కించిన గదర్ 2 రీసెంట్ గా 500 కోట్ల క్లబ్ లో చేరబోతుందని తెలుస్తుంది. కేవలం హిందీ వెర్షన్ లోనే ఈ స్థాయి హిట్ కొట్టడం మామూలు విషయం కాదు.
సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు సునామీ సృష్టిస్తుంది. 22 సంవత్సరాల తర్వాత సీక్వెల్ వచ్చిన కానీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న సన్నీ, అమీషా మధ్య కెమిస్ట్రీ గురించి అభిమానులు గొప్పగా చెప్పుకుంటున్నారు. తారా సింగ్ , సకినా పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నాయి.
2001 లో వచ్చిన గదర్ ను నేటికాలంలో తెరకెక్కించాలంటే అందులో తారా సింగ్ పాత్రకు ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు దర్శకుడు అనిల్ శర్మ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది. “అలాంటి పాత్ర చేసే నటులు బాలీవుడ్ లో మాత్రం ఎవరు లేరు. ఇక సౌత్ లో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే అలాంటి పాత్ర చేయగలడు. అతనికి ఏ పాత్ర అయినా చేయగలిగే సత్తా ఉందని” గదర్ 2 దర్శకుడు అనిల్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మాటలు విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా చేయగలిగే సత్తా తనకు ఉందని RRR సినిమాలోని కొమరం భీమ్ పాత్ర ద్వారా ప్రపంచానికి చూపించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ , సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్ ను టార్గెట్ చేస్తూ శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
“Jr. NTR Jaisa koi banda play kar sakta hai Tara Singh”: @Anilsharma_dir#Gadar2 #TalkingFilms #BollywoodHungama pic.twitter.com/F5mIj5sKx7
— BollyHungama (@Bollyhungama) September 3, 2023
