Director Anil Ravipudi lips kiss : రియాలిటీ షోస్ జడ్జెస్ అంటే మామూలుగా ఉండదు. వాళ్ళు జస్ట్ జడ్జిమెంట్ ఇచ్చి కామ్ గా కూర్చుంటాం అంటే కుదరదు. జనాలను వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయాలి. అందుకు ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ మాటలతో, చేతలతో ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఆహా వేదికగా డైరెక్టర్ అనిల్ రావిపూడి యాంకర్ దీపికా పిల్లిని కిస్ చేశాడా అన్నట్లున్న ప్రోమో దుమ్ము రేపుతోంది. విషయంలోకి వెళితే ఇటీవల తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ పేరుతో కామెడీ షో ప్రారంభమైంది. అవినాష్, సద్దాం, టిల్లు వేణు, హరి, జ్ఞానేశ్వర్, భాస్కర్ టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తున్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా ఉన్న ఈ షోకి దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ యాంకర్స్. ప్రేక్షకులే కామెడీ టీమ్స్ కి వాళ్ళ పెర్ఫార్మన్స్ ఆధారంగా మార్క్స్ వేస్తారు. కమెడియన్స్ స్టాక్స్, ఆడియన్స్ ఇన్వెస్టర్స్ అనేది కాన్సెప్ట్. పది ఎపిసోడ్స్ గా ఈ షో ప్రసారం కానుందట. డిసెంబర్ 2 నుండి ప్రారంభం కానుంది. ఈ కామెడీ షోకి ఆహా భారీగా ప్రచారం కల్పిస్తుంది. కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ కి సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు.
తాజా ప్రోమోలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి యాంకర్ దీపిక పిల్లిని పట్టుకొని లిప్ కిస్ ఇస్తున్నట్లు ఫోజ్ ఇచ్చాడు. ప్రోమోలో అనిల్ రావిపూడి-దీపికా పిల్లి ఫోజ్ చూసి జనాలు స్టన్ అవుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందన్న షాక్ లోకి వెళ్లారు. ఏమైందో తెలుసుకోవాలని ఆత్రుత వ్యక్తం చేస్తున్నారు. నిజంగా దీపిక పిల్లిని అనిల్ రావిపూడి కిస్ చేశాడా ఏంటని? అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రోమో షోపై ఆసక్తి పెంచింది.
మరోవైపు జబర్దస్త్ కి తిరిగి వస్తున్నానని చెప్పి కొత్త షోస్ చేస్తున్న సుడిగాలి సుధీర్ తీరు అర్థం కావడం లేదు. నిజంగా జబర్దస్త్ లోకి ఆయన రీ ఎంట్రీ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు కొనసాగుతున్నాయి. సుడిగాలి సుధీర్ టీమ్ కామెడీని ఇష్టపడే ఆడియన్స్ మాత్రం సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ కలిసి స్కిట్స్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నారు. కాగా హీరోగా సుధీర్ ఫస్ట్ హిట్ కొట్టాడు. ఆయన లేటెస్ట్ మూవీ గాలోడు మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ క్రమంలో ఆయన హీరోగా బిజీ అవుతారనే ప్రచారం జరుగుతుంది.