మోడీ – కేజ్రీవాల్ మధ్య తేడా ఇదేనా?

పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ) అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య అల్లర్లగా భావించే ఢిల్లీ హింసాకాండ నేటితో కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో అల్లర్లు, హింసాత్మకంగా మారడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అందుకు కారకులైన వారిపై 48 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసారు, 130 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మొహ్మద్ తాహిర్ హుస్సేన్ హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేసి […]

  • Written By: Neelambaram
  • Published On:
మోడీ – కేజ్రీవాల్ మధ్య తేడా ఇదేనా?

పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ) అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య అల్లర్లగా భావించే ఢిల్లీ హింసాకాండ నేటితో కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో అల్లర్లు, హింసాత్మకంగా మారడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. అందుకు కారకులైన వారిపై 48 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసారు, 130 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మొహ్మద్ తాహిర్ హుస్సేన్ హస్తం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేసి ఆయన ఇంట్లో దొరికిన ఆధారాలతో తాహిర్ ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తాహిర్ హుస్సేన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇంతవరకు బాగానే ఉన్నా. ఢిల్లీ అల్లర్ల వెనుక మరోకోణం కూడా ఉంది. అదే బీజేపీ బహిరంగ రహస్య కోణం. ఢిల్లీ మారణహోమం వెనుక బీజేపీ నేత కపిల్ మిశ్రా హస్తం కూడా ఉందని అనేక ఆరోపణలు వస్తున్నాయి. సాక్షాత్తూ భాజపా ఎంపీ గౌతం గంభీర కూడా అల్లర్లకు కారకులు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయినా మిశ్రాను బీజేపీ సస్పెండ్ చేయకపోవడం మరియు ఆయనపై అధికారులు దర్యాప్తు చేయకపోవడం గమనార్హం. ఆప్ చేసిన పని బీజేపీ ఎందుకు చేయలేకపోతుందో.. ఆ రాజకీయ నాయకులకే తెలియాలని, మిశ్రా ని వెనుకేసుకురావడంతో బీజేపీ రాజకీయ చాణిక్యం తేట తేలమౌతున్నదని కొందరి అభిప్రాయం.

అదే విధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో సిఏఏ నిరసనకారుల పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయుకలు (అనురాగ్ శర్మ, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా,యూపీ సీఎం యోగి అదిత్యానాథ్) పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం. ఈ విషయం పై ఢిల్లీ పోలీసుల వైఫల్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ తీవ్రంగా తప్పుబట్టారు. అదే సమయంలో సిఏఏ వ్యతిరేక ఆందోళనలపై విద్వేష ప్రసంగాలు చేసిన బీజేపీ నేతల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనీ ఆదేశాలు జారీ చేసిన గంటల వ్యవధిలోనే జస్టిస్ ఎస్ మురళీధర్ పంజాబ్ అండ్ హరియాణా హైకోర్ట్ కి బదిలీ అవడం వెనుక దాగి ఉన్న మతలబు ఏమిటో..బీజేపీ బడా నేతలకే తెలియాలని అనేకమంది విశ్లేషకుల అభిప్రాయం.

సంబంధిత వార్తలు