Prawns Benefits: మనం జీవితంలో మాంసాహారాలను ఇష్టంగానే తింటుంటాం. ఇందులో మటన్, చికెన్ లకే ప్రాధాన్యం ఇస్తుంటాం. చేపలు, రొయ్యలను పట్టించుకోం. కానీ ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే వాటిని కూడా తీసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. రొయ్యల్లో కూడా మంచి పోషకాలు ఇమిడి ఉన్నాయి. చైనాలో ఏడాదికి ఒక్కో వ్యక్తి 10 నుంచి 12 కిలోల రొయ్యలు తింటున్నారని అంచనా. అమెరికాలో అయితే ఒక్కో వ్యక్తి సగటున పదికిలోల రొయ్యలు తింటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రొయ్యలు మన దేశంలో కనీసం 800 గ్రాములు మాత్రమే తింటున్నట్లు చెబుతున్నారు. రొయ్యలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహ ఉండటంతోనే వీటిని తినేందుకు మొగ్గు చూపడం లేదనే వాదనలు ఉన్నాయి.

Prawns Benefits
రొయ్యలు తింటే గుండె జబ్బులు వస్తాయనే అనుమానాలు ఉన్నందునే ఎక్కువ మంది తినడం లేదు. రొయ్యలు తింటే పక్షవాతం వస్తుందని కూడా భయపడుతున్నారు. ఇందులో కూడా నిజం లేదు. మాంసాహారాల్లో రొయ్యలకు మంచి స్థానం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా రొయ్యలు మంచి ఆహారంగానే చెబుతోంది. మనిషికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఇందులో ఉండటం వల్ల మనకు మేలు కలుగుతుంది. పిండి పదార్థాలు, కొవ్వు ఉండటం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్న వారు దూరంగా ఉండాలని లేదు. రొయ్యల వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు లేవు. వీటిని తినడం వల్ల గుండెకు ఎలాంటి ఆపద రాదు.
రొయ్యల్లో మినరల్స్, కాల్షియం, జింక్, మెగ్నిషియం, అయోడిన్, పొటాషియం, ఫాస్పరస్, కాపర్ వంటివి పుష్కలంగా ఉండటంతో ఎముకలకు బలం వస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మహిళలు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల థైరాయిడ్ సమస్య నుంచి దూరం అవుతారు. థైరాయిడ్ పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. నూనెలో డీప్ గా ఫ్రై చేసుకుని తినడం వల్ల సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వీటిని కూరగా వండుకుని తినేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే బిర్యానిలా వండుకుంటే మంచిది.

Prawns Benefits
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో చర్మం, జుట్టు, గోళ్లకు ఆరోగ్యం కలుగుతుంది. కొందరికి మాత్రం అలర్జీ వేస్తుంది. ఇలాంటి వారు వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. రొయ్యలు తింటే చర్మంపై దద్దుర్లు వచ్చే వారు కూడా వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం. లేదంటే శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశముంది. రొయ్యలు బలవర్ధకమైన ఆహారం కావడంతో వీటిని తీసుకుని మన ఆరోగ్యం మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలాంటి అపోహలకు పోకుండా రొయ్యలను తిని ఆరోగ్యకరమైన దేహం కోసం ప్రయత్నించడం మంచిది.