
Knee Pain Problem
Knee Pain Problem: ఇటీవల కాలంలో చాలా మందికి మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. వయసు మీద పడేటప్పుడు వచ్చే నొప్పులు ఇప్పుడు తొందరగానే వస్తున్నాయి. దీంతో మోకాళ్లు పట్టుకుని కూర్చుంటున్నారు. ఆహారంలో లోపాలు ఉండటంతోనే మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. దీంతో బాధ నుంచి విముక్తి కోసం ఎన్నో మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. ఏవో మందులు మింగుతూ అప్పటి మందం సాంత్వన పొందుతున్నా దీర్ఘ కాలంలో మోకాళ్ల నొప్పుల బాధ అనుభవించక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మోకాళ్ల నొప్పుల నివారణకు ఓ మంచి చిట్కా ఉంది. దీనికి కాషాయం చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది. దీని కోసం అవిసె గింజల పొడి చేసుకోవాలి. అందులో ఒక చెంచా మెంతుల పొడి కలుపుకోవాలి. రెండింటిని కలిపి పౌడర్ చేసుకోవాలి. ఇందులో రెండు చెంచాల ఉసిరికాయ పొడి చేర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల మోకాళ్ల నొప్పి, నడుంనొప్పి, మెడనొప్పి దూరం అవుతాయి. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఇంకా కల గోంద్ కూడా మోకాళ్ల నొప్పులు దూరం చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక గ్రామ్ కలా గోంద్ వేయాలి. అది కరిగే వరకు మరిగించాలి. ఇది చిక్కటి ద్రవంలా మారిన తరువాత పైన మనం తయారు చేసుకున్న పౌడర్ ను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని భోజనం చేసే ముందు తీసుకోవాలి. ఇలా కొద్ది రోజులు తీసుకుంటే శరీరంలోని నొప్పులు మటుమాయం అవుతాయి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోకాళ్ల నొప్పులు ఇతర నొప్పులు కూడా కనిపించకుండా పోతాయి.

Knee Pain Problem
మోకాళ్ల నొప్పులతో మంచానికి పరిమితమైన వారు సైతం పరుగెత్తవచ్చు. ఇందులో ఉండే బలం అలాంటిది. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఎన్ని మాత్రలు వాడినా ప్రయోజనం ఉండదు. పైన చెప్పిన మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా ఎంతో మేలు కలుగుతుంది. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పులు ఉన్న వారు ఈ చిట్కా పాటించి వాటిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోకాళ్ల నొప్పులు దూరం చేసుకోకపోతే వాటిని పట్టుకుని బాధపడే అవకాశమే ఉంటుంది. మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.