Pearl Millets : కొవ్వును తొలగించడంలో సజ్జలు ఎంతో ఉపయోగపడతాయి తెలుసా?
Pearl Millets : మనకు ప్రధానమైన ఆహారం అన్నం. ఇది వరి గింజల నుంచి వస్తుంది. బియ్యాన్ని వండుకుని తింటుంటాం. బియ్యం రాకముందు రాగులు, సజ్జలు, జొన్నలు వంటి వాటిని ఆహారంగా తీసుకునేవారు. బియ్యం అందుబాటులోకి వచ్చాక చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం మానేశారు. సజ్జలతో రొట్టెలు చేసుకుని అల్పాహారంగా తీసుకుంటే ఎంతో మంచిది. వీటితో ఎన్నో రకాల పదార్థాలను చేసుకునే వారు. ఇంకా జొన్నలు, రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. సజ్జల్లో లిగ్నిన్ అనే పైటో కెమికల్ […]

Pearl Millets : మనకు ప్రధానమైన ఆహారం అన్నం. ఇది వరి గింజల నుంచి వస్తుంది. బియ్యాన్ని వండుకుని తింటుంటాం. బియ్యం రాకముందు రాగులు, సజ్జలు, జొన్నలు వంటి వాటిని ఆహారంగా తీసుకునేవారు. బియ్యం అందుబాటులోకి వచ్చాక చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం మానేశారు. సజ్జలతో రొట్టెలు చేసుకుని అల్పాహారంగా తీసుకుంటే ఎంతో మంచిది. వీటితో ఎన్నో రకాల పదార్థాలను చేసుకునే వారు. ఇంకా జొన్నలు, రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచివి.
సజ్జల్లో లిగ్నిన్ అనే పైటో కెమికల్ ఉంటుంది. ఇది రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేయడంలో సాయపడుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పొరలు పొరలుగా పేరుకుపోవడం వల్ల రక్త సరఫరాలో అడ్డంకులు ఏర్పడి గుండె జబ్బులు రావడానికి కారణమవుతుంది. గుండెలో ఉండే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి రక్త సరఫరా సాఫీగా జరిగేందుకు దోహదపడుతుంది. ఇందులో ఉండే లిగ్నిన్ అనే పైటో కెమికల్ మనకు ఉపయోగపడుతుంది. సజ్జలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
సజ్జల్లో పాలీ అన్ ప్యాురేటెడ్ ఫ్యాట్ ఉండటం వల్ల చెడు కొవ్వులను తగ్గిస్తాయి. వంద గ్రాముల సజ్జల్లో 11 గ్రాముల ఫైబర్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారాల్లో కొవ్వులు పేగులు గ్రహించకుండా చేయడంలో ఫైబర్ అడ్డుకుంటుంది. రక్తంలో కొవ్వు చేరకుండా చూస్తుంది. అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది. గుండె జబ్బులు రాకుండా చేయడంలో తోడ్పడుతుంది. సజ్జలు మనకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మంచిది.
సజ్జలను రవ్వగా చేసుకుని సంకటి, అన్నంగా వండుకుని తినొచ్చు. బియ్యంతో వండుకునే అన్నంతో మనకు ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సజ్జలను ఆహారంగా తీసుకుంటే మనకు ఆరోగ్య పరిరక్షణ ఉంటుంది. సజ్జలతో అన్నం, రొట్టెలుగా కూడా చేసుకోవచ్చు. సజ్జలను తింటే మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రస్తుత రోజుల్లో సజ్జలను ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం సిద్ధించడం ఖాయం. అందుకే అన్నంకు బదులు సజ్జలను తీసుకుంటే ఫలితం ఉంటుంది.