Megastar Chiranjeevi: ఈ బ్లాక్ బస్టర్ మూవీకి చిరంజీవి డైరెక్టర్ అన్న విషయం తెలుసా?

మెగాస్టార్ చిరంజీవితో సమానంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు హీరోలు దాదాపు ఎవరూ డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. కానీ పోటీ పడి స్టార్ హీరోలయ్యారు. అయితే మెగస్టార్ చిరంజీవి సైతం డైరెక్టర్లు, నిర్మాతలకు విలువ ఇచ్చేవారు. డైరెక్టర్ల ఆలోచనలకు సహకరించేవారు. కానీ ఒక్కోసారి మాత్రం సలహాలు ఇచ్చేవారు. చిరంజీవి ఇచ్చే సలహాలు కొందరు పాటించి సక్సెస్ అయిన వారు ఉన్నారు.

  • Written By: SS
  • Published On:
Megastar Chiranjeevi: ఈ బ్లాక్ బస్టర్ మూవీకి చిరంజీవి డైరెక్టర్ అన్న విషయం తెలుసా?

Megastar Chiranjeevi: ప్రతీ సినిమా సృష్టికర్త డైరెక్టర్. ఒక సినిమా ఎలా ఉంటుందో దానిని తీసిన డైరెక్టర్ ఆలోచలను అదే విధంగా ఉంటాయని అంటుంటారు. చాలా మంది ఇండస్ట్రీకి డైరెక్టర్ కావాలని వస్తుంటారు. కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో హీరోగానో.. ఇతర ఆర్టిస్టుగానో మిగిలిపోతారు. అయితే ఒక్కోసారి హీరోగా నటించేవాళ్లు తమ సినిమాను తామే డైరెక్షన్ చేసుకుంటారు. అలా వచ్చిన సినిమాలు బంపర్ హిట్టు కొట్టాయి. 1980-90ల్లో డైరెక్షన్లో ఇతరులు కలగజేసుకునేవారు కాదు. కానీ కొందరుస్టార్లు చెప్పే సలహాలను పాటించేవారు. అయితే కాకలు తీరిన డైరెక్టర్లకు సలహాలు ఇవ్వాలంటే మాములు విషయం కాదు.కానీ చిరంజీవికి ఓసారి ఆ చాన్స్ వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవితో సమానంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొందరు హీరోలు దాదాపు ఎవరూ డైరెక్షన్ జోలికి వెళ్లలేదు. కానీ పోటీ పడి స్టార్ హీరోలయ్యారు. అయితే మెగస్టార్ చిరంజీవి సైతం డైరెక్టర్లు, నిర్మాతలకు విలువ ఇచ్చేవారు. డైరెక్టర్ల ఆలోచనలకు సహకరించేవారు. కానీ ఒక్కోసారి మాత్రం సలహాలు ఇచ్చేవారు. చిరంజీవి ఇచ్చే సలహాలు కొందరు పాటించి సక్సెస్ అయిన వారు ఉన్నారు.

మెగాస్టార్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’. 1991 మే నెలలో రిలీజైన ఈ మూవీ వసూళ్ల పరంగానూ సక్సెస్ సాధించింది. ఈ సినిమాను ఫేమస్ డైరెక్టర్ బాపినీడు తీశారు. ఈ సినిమా అంతా పూర్తయిన తరువాత ఎడిటింగ్ చేసే సమమంలో బాపినీడుతో కలిసి చిరంజీవి ఉన్నారు. ఈ సమయంలో మురళీ మోహన్ రావు ను చంపేసే సీన్ లో కొన్ని మార్పులు చేయాలని బాపినీడుకు చిరంజీవి సూచించారట. చిరంజీవి చెప్పిన మాటలకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా బాపినీడు నీ ఆలోచలనకు అనుగుణంగా సినిమా తీయాలని కోరాడు.

దీంతో ఈ సీన్స్ ను మెగాస్టార్ కెమెరా పట్టుకొని మరోసారి షూట్ చేశారట. ఈ సీన్ మొత్తం చిరంజీవి చెప్పినట్లే తీశారట. ఈ సినిమాకు ఈ సీనే హైలెట్ అన్న విషయం చాలా మందికి తెలిసిందే. అయితే చిరంజీవి ఈ సిన్ కు డైరెక్షన్ చేశారన్న విషయం ఇప్పటి వరకు బయటకు రానివ్వలేదు. అయితే ఆయన స్నేహితుడు నారాయణ రావు దీనిని బయటపెట్టారు. నారాయణరావు చిరంజీవితో కలిసి చాలా సినిమాలో నటించారు. వీరిద్దిరి మధ్య మంచి స్నేహం ఉంది. చిరకు సంబంధించిన పర్సనల్ విషయాలను నారాయణ రావుతో షేర్ చేసుకునేవారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఆయన బయటపెట్టలేదు.

సంబంధిత వార్తలు