
Shriya Saran- Ram Charan
Shriya Saran – Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి నేడు తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన విలక్షణ నటుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచాడు.తాను తండ్రికి తగ తనయుడిని అని మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు, ఇక రెండవ సినిమా మగధీర తో ఇండస్ట్రీ హిట్ కొట్టి బాక్స్ ఆఫీస్ పరంగాను తాను తన తండ్రికి ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు.
అలా చిరంజీవి గారి పేరు నిలబెడుతూ ఇండస్ట్రీ లో అంచలంచలుగా ఎదిగిన రామ్ చరణ్ ‘రంగస్థలం’ మరియు రీసెంట్ గా విడుదలై ఆస్కార్స్ కి నామినేట్ అయినా ‘#RRR’ వంటి సినిమాలతో పాన్ వరల్డ్ రేంజ్ లో తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకున్నాడు, ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమాలు చేసేందుకు ఇండియా లో ఉన్న డైరెక్టర్స్ అందరూ క్యూలు కడుతున్నారంటే ఆయన రేంజ్ ఇప్పుడు ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు.
అయితే చిరంజీవి తనయుడి నుండి రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి అని జనాలతో అనిపించుకునే రేంజ్ కి ఎదిగిన రామ్ చరణ్ సినీ జర్నీ ని గుర్తు చేసుకుంటూ ఆయన పాత వీడియోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్..వాటిల్లో ఇండస్ట్రీ లోకి రాకముందు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో రామ్ చరణ్ తీసుకుంటున్న యాక్టింగ్ ట్రైనింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది.

Shriya Saran- Ram Charan
ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ ని చూడడానికి అప్పటి స్టార్ హీరోయిన్ శ్రీయ ఒకరోజు వస్తుంది,ఆమెతో రామ్ చరణ్ యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో తెగ వైరల్ గా మారింది..వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు హీరో హీరోయిన్ గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు..రీసెంట్ గా విడుదలైన #RRR చిత్రం లో రామ్ చరణ్ కి తల్లిగా నటించింది శ్రీయ, అలా వీళ్లిద్దరు కలిసి నటించిన ఏకైక వీడియో గా ఫిలిం ఇన్స్టిట్యూట్ వీడియో నిలిచింది.