Virat Kohli- Naveen Ul Haq: విరాట్ కోహ్లీ సార్’ సారీ.. ఎంట్రోయ్.. ఇలా షాకిచ్చావ్

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం సందర్భంగా జరిగిన ఒక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ గొడవపడ్డారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది.

  • Written By: BS Naidu
  • Published On:
Virat Kohli- Naveen Ul Haq: విరాట్ కోహ్లీ సార్’ సారీ.. ఎంట్రోయ్.. ఇలా షాకిచ్చావ్

Virat Kohli- Naveen Ul Haq: భారత మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీకి, ఆఫ్గనిస్తాన్ ఫాస్ట్ బౌలర్, లక్నో జట్టు ఆటగాడు నవీన్ ఉల్ హక్ మధ్య ఒక మ్యాచ్ సందర్భంగా వాగ్వాదం నడిచింది. వీరిద్దరి మధ్య కొద్ది రోజులపాటు సైలెంట్ గా వార్ నడిచింది. ఒకానొక దశలో వీరిద్దరూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇచ్చుకున్నారు. అయితే, దీనికి చెక్ చెప్పేలా నవీన్ ఉల్ హక్.. విరాట్ కోహ్లీకి క్షమాపణలు చెబుతూ తాజాగా ట్వీట్ చేశాడు. దీంతో ఈ వార్ ముగిసినట్టుగా పలువురు పేర్కొంటున్నారు.

ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం సందర్భంగా జరిగిన ఒక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ గొడవపడ్డారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో వీరిద్దరి మధ్య చిన్నపాటి గొడవ చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వీరిద్దరూ ఆ గొడవను కొనసాగించారు. నవీన్ ను టార్గెట్ గా చేసుకున్న ఆర్సిబి ఫాన్స్ ఓ రేంజ్ లో అతన్ని ఆడుకుంటున్నారు. దీంతో నవీన్ ఉల్ హక్ వెనక్కి తగ్గాడు. ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెబుతూ విరాట్ సార్ అంటూ ఈ వాగ్వాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశాడు.

కోహ్లీ అవుట్ అవ్వగానే స్వీట్ మ్యాంగోస్ అంటూ ఫోటోలు..

ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తక్కువ స్కోరుకే అవుట్ అవ్వగానే నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియాలో స్వీట్ మ్యాంగోస్ అనే క్యాప్షన్ తో మామిడి పండ్లు ఫోటోలను పెట్టాడు. ఇక అక్కడి నుంచి గొడవ మరో స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఆర్సిబి అభిమానులు ఓ రేంజ్ లో నవీన్ ఉల్ హక్ ను ఆడేసుకుంటున్నారు. లక్నో టీమ్ ఓడిపోయినా, నవీన్ ఉల్ హక్ పేలవ ప్రదర్శన చేసినా అతడిని టార్గెట్ గా చేసుకుని ఆ మామిడి పండ్ల ప్రస్తావని తీసుకొస్తూ ట్రోల్ చేస్తున్నారు. చివరికి భారత మాజీ క్రికెటర్లు కూడా అతడిని వదలడం లేదు. ఈ బాధ భరించడం కంటే సారీ చెప్పడం మేలు అనుకున్నట్లు భావించిన నవీన్ ఉల్ హక్ విరాట్ కోహ్లీకి ట్విట్టర్ వేదిక క్షమాపణలు తెలియజేసినట్లు సోషల్ మీడియాలో ఆ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.

గతంలో సెటైర్లతో రెచ్చగొట్టిన హక్..

ఐపీఎల్ సీజన్ లీగ్ దశలోనే బెంగళూరు జట్టు నిష్క్రమించింది. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఆర్సిబి ఫ్యాన్సును నవీన్ ఉల్ హక్ తన సెటైర్లతో రెచ్చగొట్టాడు. లక్నో టీమ్ ప్లే ఆఫ్ కు చేరినా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 81 పరుగులు తేడాతో ఓడిపోయింది. దీంతో ఆర్సిబి ఫాన్స్ ఓ రేంజ్ లో నవీన్ ఉల్ హక్ ను సోషల్ మీడియాలో ఆడుకున్నారు. ఇలా ట్రోలింగ్ జరుగుతుండగానే విరాట్ కోహ్లీకి నవీన్ క్షమాపణ చెప్పినట్లు కొన్ని ట్వీట్స్ వైరల్ గా మారాయి. తప్పు ఒప్పుకుంటున్నానని మరోసారి సీనియర్ ప్లేయర్లతో గొడవ పడనని, తన లిమిట్స్ లో తాను ఉంటానని నవీన్ చేసినట్లు కొన్ని ట్వీట్లు వైరల్ అయ్యాయి. వీటిని పెద్ద ఎత్తున బెంగళూరు జట్టు అభిమానులు షేర్ చేశారు. ఈ ట్వీట్లు చూసిన పలువురు తిక్క కుదిరింది.. బాబు లైన్లోకి వచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఈ ట్వీట్ నవీన్ ఉల్ హక్, ఎవరైనా ఫేక్ అకౌంట్ సృష్టించి ఈ విధంగా పెట్టారా అన్నది స్పష్టత లేకుండా పోయింది. ఏది ఏమైనా ఈ ట్వీట్ చూసిన తర్వాత ఆర్సిబి, కోహ్లీ జట్టు అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వాటిని షేర్ చేస్తున్నారు.

Recommended Video:

సంబంధిత వార్తలు