BJP: ‘బండి’ జైలుకెళ్లడం బీజేపీకి మైలేజ్ పెంచిందా?
BJP: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీలు ప్రజల్లో మైలేజ్ కోసం తహతహలాడుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రజలను తమవైపు ఆకర్షించేలా వ్యూహాలు రచిస్తూ టీఆర్ఎస్, బీజేపీలు ముందుకెళుతున్నాయి. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ స్పందిస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు రోజుకురోజుకు హీటెక్కుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారడాన్ని ఆపార్టీ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో ఆపార్టీ ముఖ్య నేతలపై అధికార […]

BJP: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఈ రెండు పార్టీలు ప్రజల్లో మైలేజ్ కోసం తహతహలాడుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రజలను తమవైపు ఆకర్షించేలా వ్యూహాలు రచిస్తూ టీఆర్ఎస్, బీజేపీలు ముందుకెళుతున్నాయి. టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ స్పందిస్తుండటంతో తెలంగాణలో రాజకీయాలు రోజుకురోజుకు హీటెక్కుతున్నాయి.
తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారడాన్ని ఆపార్టీ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో ఆపార్టీ ముఖ్య నేతలపై అధికార బలాన్ని ప్రయోగిస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీ ముఖ్య నేతల కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం, గృహనిర్బంధాలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడం ఇందులో భాగమనేనని తెలుస్తోంది. అయితే కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ ను విధించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది.
కరోనా నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను పోలీసులు ఎందుకు అంతగా సీరియస్ తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఈ పరిణామం మాత్రం బీజేపీకి అడ్వాంటేజీగా మారింది. బండి సంజయ్ జైలుకెళ్లడాన్ని బీజేపీ పెద్దలు రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.
జేపీ నడ్డా రాకపై పోలీసులకు ముందస్తు సమాచారం ఉండటంతో ఆయన ఎయిర్ పోర్టుకు రాగానే అరెస్టు చేస్తామని లీకులిచ్చారు. దీంతో హైదరాబాద్ పరిసరాల ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఉదయం కేంద్ర మంత్రులు బండి సంజయ్ తో ములాఖాత్ నడుపగా సాయంత్రం నాటకీయ పరిణామాల మధ్య జేపీ నడ్డా శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలోని ఉద్యోగులకు బీజేపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కు కోర్టు 14రోజుల రిమాండ్ విధించడంతో బీజేపీ సైతం 14రోజులు తెలంగాణలో నిరసన కార్యక్రమాలు చేసేందుకు నిర్ణయించింది. గత రెండ్రోజులు బీజేపీ చేస్తున్న రాజకీయం ఆపార్టీ తెలంగాణలో మరింత మైలేజ్ పెంచేలా కన్పిస్తోంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదిఏమైనా బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణలో ఎన్నికలకు ముందే అగ్గిరాజుకున్నట్లు కన్పిస్తోంది. బీజేీపీ వ్యూహాన్ని టీఆర్ఎస్ ఎలా తిప్పుకొడుతుందో వేచిచూడాల్సిందే..!
