Chiranjeevi- CM Jagan: మనిషికి ఆశ ఉండాలి. అందులో ఏమాత్రం తప్పులేదు. తప్పు పట్టే అవకాశం కూడా లేదు. అదే అత్యాశవుంటే.. అందులో తండ్రి శవం పక్కనే ఉన్నా.. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. ఎలా ఉంటుంది? మనిషి అనే వాడు ఇలా చేస్తాడా అనే సందేహం మీ బుర్రలను తొలిచేస్తుంది కదూ! కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరూ అనే సందేహం అందరిలోనూ వ్యక్తం అయింది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక సోనియాగాంధీ కొణిజేటి రోశయ్యను ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ప్రకటించారు. కానీ తండ్రి తర్వాత తానే ముఖ్యమంత్రి కావాలని జగన్ అనుకున్నారట! దీనికి సంబంధించి సీమ ఎమ్మెల్యేలను రంగంలోకి దించి మిగతా వారి సహకారం కోరారట! ఇదే విషయం అప్పట్లో చిరంజీవి దృష్టికి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల వల్ల కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇది జరిగిన చాలాకాలం తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు చేసిన పన్నాగాలన్నింటిని ఆయన బయటపెట్టారు. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం నానా గడ్డి కరిచారని ఆ సమయంలో చిరంజీవి ఆరోపించారు. జగన్ తనకు పదవి దక్కకపోవడం వల్ల తనకున్న సొంత మీడియాలో అధికార పార్టీపై లేనిపోని వార్తలు రాయించారని చిరంజీవి ఫైర్ అయ్యారు.
ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే
2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరుపతి వేదికగా మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. చిరంజీవికి ఉన్న మేనియా కారణంగా అప్పట్లో చాలామంది ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తన కోవర్టులను ప్రజారాజ్యం పార్టీలో చేర్పించారు. ఆ తరహా రాజకీయాలు తెలియని చిరంజీవి అందరినీ నమ్మారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో కలియతిరిగారు. అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చిరంజీవి కాన్వాయ్ పై రాజశేఖర్ రెడ్డి వర్గీయులు కోడిగుడ్లు, టమాటాలతో దాడులు చేశారు. ఇంకా పలు సందర్భాల్లో ఆయనను అడ్డుకున్నారు. చిరంజీవి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కానీ ఏనాడు కూడా చిరంజీవి పల్లెత్తు మాట కూడా అనలేదు. రాజశేఖర్ రెడ్డి కోవర్టు రాజకీయాల వల్ల ప్రజారాజ్యం పార్టీ అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. నాటి పరిణామాల వల్ల చిరంజీవి మనసు గాయపడింది. మృదుస్వభావి అయిన చిరంజీవి కొద్ది కాలం తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన పరిధి మేర పనిచేశారు. అప్పట్లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దక్షిణ భారతదేశంలో టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ ముందు ఒక ప్రతిపాదన ఉంచితే దీనికి ఆమె సమ్మతం తెలిపారు. ఆ టూరిజం సర్క్యూట్ నే బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు చిరంజీవికి ఎంత ముందుచూపు ఉందో..
అవమానాలు తట్టుకునైనా
పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో “ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పవాడు అవుతాడని” అని డైలాగ్ ఉంటుంది. బహుశా దానిని చిరంజీవిని దృష్టిలో పెట్టుకునే త్రివిక్రమ్ శ్రీనివాస్ రాశారేమో! వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న చిరంజీవి.. తెలుగు సినిమా పరిశ్రమ కోసం పది మెట్లు కిందకు దిగారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, దాసరి నారాయణరావు తర్వాత ఆ స్థాయిలో గొప్ప వ్యక్తిత్వం ఉన్న చిరంజీవి సినిమా టికెట్ ధరలు, ఇతరత్రా సమస్యల పరిష్కారం కోసం తానే రంగంలోకి దిగారు. ఎంత మంది ఏమంటున్నా పట్టించుకోకుండా.. ఇతర సినీ పెద్దలతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైయస్ జగన్ ను కలిశారు. సినీ రంగ పరిశ్రమను ఆదుకోవాలని వైయస్ జగన్ ను అభ్యర్థించారు. అయితే ఈ భేటీని బాలకృష్ణ, మంచు విష్ణు వంటి వారు వ్యతిరేకించినా చిరంజీవి పెద్దగా లెక్క చేయలేదు. ఎందుకంటే సినీ పరిశ్రమ పెద్దగా ఇలాంటి అవమానాలు ఎదురవుతాయని ఆయనకు ముందే తెలుసు.
అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు.. గ తేడాది పుష్ప, అఖండ, త్రిబుల్ ఆర్.. ఇలాంటి సినిమాలు వందల కోట్ల కలెక్షన్లు సాధించాయంటే దానికి చిరంజీవి నాడు చూపిన చొరవే కారణం. దీనిని ఆయన వ్యతిరేకులు సైతం అంగీకరిస్తారు. బ్లడ్ బ్యాంకు, నేత్ర నిధి, కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ల వితరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి చేతికి ఎముకే లేదనే తీరుగా సహాయం చేశారు. అందుకే ఇవాళ సినీ పరిశ్రమ ఏ సమస్య వచ్చినా ఆయన గుమ్మం వైపే చూస్తుంది. రాజకీయ నాయకుడిగా చిరంజీవి విఫలం కావచ్చు. ఎందుకంటే ఆయనకు రాజకీయాలు తెలియదు. కానీ ఒక నాయకుడిగా ఆయన ఎప్పుడూ విఫలం కాలేదు. రాజకీయ నాయకుడు తన అవసరాల కోసం పనిచేస్తాడు. నాయకుడు మాత్రం ప్రజల అవసరాలను తీర్చుతాడు. రెండిటికీ ఎంత తేడా? అందుకే చిరంజీవి అంటే చిరంజీవే! ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు!
Also Read:Iran Womens: ఇరాన్ తీరే అంత: మహిళలు వారి దృష్టిలో కట్టు బానిసలు.. వారితో ఏమేం చేస్తారో తెలుసా?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Did jagan want to be the chief minister despite his fathers dead body how did chiranjeevi oppose this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com