Chandrababu Naidu : తన అరెస్ట్ ను ఆపడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాడా? సంచలన నిజం లీక్
చంద్రబాబు అమిత్ షాను బిగ్ షాట్ కలిపారని.. ఆయన చొరవతోనే ఈ కలయిక సాధ్యమని ఢిలల్ీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అన్నది త్వరలో తెలియనుందన్న మాట. అయితే ఇది ఊహాగానం కాదని.. సంచలన లీక్ అంటూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.

Chandrababu Naidu : చంద్రబాబు త్వరలో అరెస్టు కాబోతున్నారా? దానిని ఆపేందుకే ఢిల్లీ పెద్దల సాయం కోరారా? మొన్న అమిత్ షాను కలిసింది పొలిటికల్ అజెండా కాదా? పూర్తిగా తన వ్యక్తిగత రక్షణ కోసమేనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు కొత్త పళ్ల సెట్ పట్టుకొని ఢిల్లీ వెళ్లింది పొత్తుల కోసం కాదు. అమరావతి భూ కుంభకోణంలో నుంచి బయటపడేందుకేనన్న కామెంట్స్ వస్తున్నాయి. వాటికి సంబంధించి పోస్టులు, కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో హై ప్రొఫైల్ కేసులు నడుస్తున్నాయి. ఏపీలో వివేకానందరెడ్డి హత్య కేసు, తెలంగాణలో లిక్కర్ స్కాం.. ఈ రెండింటి చుట్టూ తెలుగు రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు సందట్లో సడేమియా అన్నట్టు అమరావతి భూ కుంభకోణం పట్టుబిగిస్తున్నట పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవడంతో అంతా పొలిటికల్ అనుకున్నారు. కానీ తెర వెనుక అరెస్టు ఆపుకునేందుకేనన్న కామెంట్స్ పెరుగుతున్నాయి.
అమిత్ షా తో చంద్రబాబు సమావేశం జరిగింది. నిజానికి ఇది చాలా పెద్ద పరిణామం. తెలుగుదేశం అనుకూల పత్రికలు దీన్ని చాలా భారీ ఎత్తున ప్రచారం చేయాల్సి వుంది. సోషల్ మీడియా లో అస్సలు హడావుడి లేదు. ఎందుకు?కోరమాండల్ రైలు ప్రమాదం వార్త హైలైట్ చేయాల్సి వచ్చింది కనుక ఈ వార్త చిన్నదైపోయిందా? అలా అనుకొవడానికి లేదు. ఇన్నాళ్లూ అదిగో మీటింగ్ అంటే ఇదిగో పొత్తు అంటూ గతంలో ఎన్నో వార్తలు వండి వార్చారు. అలాంటిది ఇప్పుడు ఇదేదో ఫార్మల్ మీటింగ్. పొత్తుల గురించి చర్చ రాలేదు. జస్ట్ పరిస్థితులు మాట్లాడుకున్నారు. అని మాత్రం సింపుల్ గా రాసి వదిలేసుకున్నారు అంటే కథ వేరే ఉందని ఇట్టే అర్ధమైపోతోంది.
జగన్ ఢిల్లీ వెళ్లినపుడల్లా కేసులు, అరెస్ట్ ల కోసం వెళ్లారు అనే ఫీడింగ్ లు వినిపించేవి. ఇప్పుడు చంద్రబాబు వెళ్లినా అదే తరహా ఫీడింగ్ వినిపిస్తోంది. ఆంధ్రలో త్వరలో జరుగుతుంది అని వినిపిస్తున్న ఓ పెద్ద తలకాయ అరెస్ట్ వార్తల నేపథ్యంలో చంద్రబాబు వెళ్లారనే గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమయ్యాయి. రాజీ ప్రతిపాదనతోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని ఊహాగానాలు పెరుగుతున్నాయి. చంద్రబాబు అమిత్ షాను బిగ్ షాట్ కలిపారని.. ఆయన చొరవతోనే ఈ కలయిక సాధ్యమని ఢిలల్ీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అన్నది త్వరలో తెలియనుందన్న మాట. అయితే ఇది ఊహాగానం కాదని.. సంచలన లీక్ అంటూ నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
