Dhruv Vikram: తమిళ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా ఎదగడానికి దాదాపు పదిహేను ఏళ్ళు అడ్డమైన కష్టాలు పడాల్సి వచ్చింది. కానీ అతని కుమారుడు ‘ధృవ్’కి మాత్రం అవకాశం చాలా సరదాగా వచ్చింది. నిజానికి స్టార్ వారసుల్లో అందరీ కంటే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకోగలిగాడు ‘ధృవ్’. లుక్ పరంగా, ఫిజిక్ పరంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఓ దశలో తమిళ సూపర్ స్టార్ అవుతాడు అని అతని పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
కానీ సినిమా రిలీజ్ అయ్యాక గానీ, మనోడి టాలెంట్ బయటపడలేదు. ఏ ఎమోషన్ కి, ఏ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడో కూడా క్లారిటీ లేకుండా నటించాడు. అందుకే రెండో సినిమా విషయంలో ‘ధృవ్’ నటన పరంగా చాలా కసరత్తులు చేశాడు. ‘యాక్టింగ్ బాగుంది , కుర్రాడు బాగా చేస్తున్నాడు’ అని పేరు తెచ్చుకోగలిగితే.. స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోగలిగే కెపాసిటీ ‘ధృవ్’కి ఉంది.
మొదటి సినిమా.. తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ నట వారసుడు, యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ముఖ్యంగా హీరో మెటీరియల్ అని మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు. అయితే ‘ధృవ్’ పై అప్పుడే నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నాయి. తన సినిమాలో తన సరసన ఏ హీరోయిన్ నటించాలో ‘ధృవ్’ నిర్ణయిస్తున్నాడట.
ప్రస్తుతం ‘ధృవ్’, మురుగదాస్ అసిస్టెంట్ రవికాంత్ అనే కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సెన్సేషన్ బ్యూటీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ను మొదట ‘ధృవ్’ రికమండ్ చేశాడు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓవర్ నైట్ లోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ‘ప్రియా ప్రకాష్ వారియర్’. సరే ఎలాగూ కుర్రాడు ముచ్చట పడుతున్నాడు కాబట్టి.. ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు మేకర్స్.

Dhruv Vikram Upcoming Movie
అయితే, ఇప్పుడు మళ్ళీ ‘ప్రియా ప్రకాష్ వారియర్’ వద్దు, కేతికా శర్మను హీరోయిన్ గా పెట్టుకుందాం అని దర్శకనిర్మాతల పై ఒత్తిడి పెంచుతున్నాడట. ‘కరెక్ట్ గా రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించలేదు.. వీడేంటి రా బాబు ? అప్పుడే నెలకు ఒక హీరోయిన్ ను మారుద్దాం’ అంటాడు అని తమిళ సినీ జనాల్లో ‘ధృవ్’ పై నెగిటివ్ ప్రచారం జరుగుతుంది.

Dhruv Vikram Upcoming Movie
ఐతే, ధృవ్ మాత్రం ఈ ప్రచారాలు ఏమి పట్టించుకోకుండా.. ప్రస్తుతం కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం తన ఫామ్ హౌస్ లో ఏకాంతంగా గత కొన్ని రోజుల నుండి తన ట్రైనర్ సాయంతో కఠినతరమైన కసరత్తులు చేసుకుంటూ ముందుకుపోతున్నాడు.