హైపర్ ఆది స్కిట్ లో దొరబాబు స్థానం ఎవరికి?

బుల్లితెర జబర్దస్త్ కామెడీ షోలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దొరబాబు, పరదేశీ.. వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో జబర్దస్త్ ఫ్యామిలీ షాక్ కి గురైంది. స్కిట్ లో నటించే సందర్భంలో హైదర్ ఆది వీరి పై ద్వందార్థం (డబల్ మీనింగ్) పదాలు వాడే వారు. దొరబాబూ యూట్యూబ్ లో బాగా పాపులర్ అని, ఆయన అసభ్యకర దృశ్యాలు చూస్తారని, అవే చేస్తారని సరదాగా హైపర్ ఆది అనేవాడు అయితే వాళ్ళు నిజంగానే అలాంటి పని చేసి దొరకటం […]

  • Written By: Neelambaram
  • Published On:
హైపర్ ఆది స్కిట్ లో దొరబాబు స్థానం ఎవరికి?


బుల్లితెర జబర్దస్త్ కామెడీ షోలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దొరబాబు, పరదేశీ.. వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో జబర్దస్త్ ఫ్యామిలీ షాక్ కి గురైంది. స్కిట్ లో నటించే సందర్భంలో హైదర్ ఆది వీరి పై ద్వందార్థం (డబల్ మీనింగ్) పదాలు వాడే వారు. దొరబాబూ యూట్యూబ్ లో బాగా పాపులర్ అని, ఆయన అసభ్యకర దృశ్యాలు చూస్తారని, అవే చేస్తారని సరదాగా హైపర్ ఆది అనేవాడు అయితే వాళ్ళు నిజంగానే అలాంటి పని చేసి దొరకటం అందర్నీ షాక్ కి గురిచేసింది. ఈ నేపథ్యంలో కామెడీ షో నుంచి దొరబాబు, పరదేశీలను తొలగించే విధంగా జబర్దస్త్ యాజమాన్యం ఆలోచిస్తుంది. అయితే హైపర్ ఆది స్కిట్ లో వీరిద్దరి స్థానంలో ఎవరని తీసుకుంటుంది ఇంకా తెలియాల్సి ఉంది.

హైపర్ ఆది స్కిట్ లో నటించే దొరబాబును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసులు దొరబాబును, మరో నటుడు పరదేశీ అదుపులోకి తీసుకున్నారు. మాధవదారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దొరబాబు, పరదేశీతో పాటు ఒక మహిళ, నలుగురు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా దొరబాబు, పరదేశీ నుంచి 20 వేల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు