భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సివాలా, ప్రతిరోజుపండగే లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ ని అందించిన నిర్మాణ సంస్థలు జిఏ2 పిక్చర్, యువి క్రియెషన్స్ ఇప్పడు జిఏ2యువి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. నిర్మాణ విలువలు మినిమమ్ గ్యారెంటి సబ్జక్ట్స్ తో అత్యధిక సక్సస్ రేట్ తో దూసుకుపోతున్న ఈ రెండు సంస్ధలు ఈ చిత్రాన్ని విడుదల చేయటమే డి40 కున్న క్రేజ్ ని తెలియజేస్తుంది. ఈ చిత్రం యెక్క మెదటి లుక్, టీజర్ వివరాలు త్వరలో తెలియజేస్తారు.