మామ చిత్రానికి అల్లుడి రీమేక్

1981 లో రజనీకాంత్ సూపర్ హిట్ సినిమా “నెట్రి కాన్ ” ఇప్పుడు మరోసారి తెర కెక్కబోతోంది.ప్రఖ్యాత దర్శకుడు కె బాలచందర్ తన కవితాలయ బ్యానర్ ఫై ఎస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దాన్ని తెలుగులో ముసలోడి దసరా పండుగ పేరుతొ అనువదించడం కూడా జరిగింది. కాగా ఇపుడా చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఎస్పీ.ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఈ […]

  • Written By: Neelambaram
  • Published On:
మామ చిత్రానికి అల్లుడి రీమేక్

1981 లో రజనీకాంత్ సూపర్ హిట్ సినిమా “నెట్రి కాన్ ” ఇప్పుడు మరోసారి తెర కెక్కబోతోంది.ప్రఖ్యాత దర్శకుడు కె బాలచందర్ తన కవితాలయ బ్యానర్ ఫై ఎస్ పి ముత్తురామన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. దాన్ని తెలుగులో ముసలోడి దసరా పండుగ పేరుతొ అనువదించడం కూడా జరిగింది. కాగా ఇపుడా చిత్రాన్ని రజనీకాంత్ అల్లుడు ధనుష్ రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఎస్పీ.ముత్తురామన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రజనీకాంత్ తండ్రిగా, కొడుకుగా డబుల్ రోల్ చేశారు.విశేషం ఏమిటంటే ఇదే సినిమాని 1992 లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు రాజశేఖర్ హీరోగా అహంకారి పేరుతొ పునర్ నిర్మించడం జరిగింది. అంతేకాదు ఇదే కథాంశం ఆధారంగా చిరంజీవి హీరోగా అందరివాడు చిత్రం ,,అజయ్ ప్రధాన పాత్రలో దిక్కులు చూడకు రామయ్య అనే చిత్రాలు వచ్చాయి.

ఇక ఈ రీమేక్ చిత్రం లో కథానాయకిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ను తీసుకోవాలని ధనుష్ అనుకొంటున్నాడట.. అపట్లో ఒరిజినల్ వెర్షన్లో రజనీకాంత్ సరసన ఒక హీరోయిన్ గా నటించిన మేనక ఈ కీర్తి సురేష్ కి తల్లి కావడం విశేషం. ఇక ‘అసురన్, ఎన్నై నొక్కి పాయుమ్ తూటా , పటాస్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకొని దూకుడు మీదున్న ధనుష్ త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు.
Remakes are safe bets

సంబంధిత వార్తలు