Dhanush ‘Sir’ collections : ‘సార్’ 4 వారాల వసూళ్లు.. ఇలాంటి లాభాలు తెలుగు హీరోలకు కూడా రాలేదుగా!

Dhanush ‘Sir’ collections : తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో పరిచయం అవుతూ తెరకెక్కిన ‘సార్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.కేవలం ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సంచలనం సృష్టించింది.ఇక తర్వాత నాల్గవ రోజు నుండి లాభాల బాటలో నడుస్తూ ఇప్పటికీ డీసెంట్ […]

  • Written By: NARESH
  • Published On:
Dhanush ‘Sir’ collections : ‘సార్’ 4 వారాల వసూళ్లు.. ఇలాంటి లాభాలు తెలుగు హీరోలకు కూడా రాలేదుగా!

Dhanush ‘Sir’ collections : తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగులో పరిచయం అవుతూ తెరకెక్కిన ‘సార్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.కేవలం ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సంచలనం సృష్టించింది.ఇక తర్వాత నాల్గవ రోజు నుండి లాభాల బాటలో నడుస్తూ ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తుంది.

ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ‘ఇది కేవలం వారం ఆడే సినిమా కాదు..నాలుగు వారాలు ఆడే సినిమా’ అని చెప్పాడు.ఆయన చెప్పిన దానికంటే నాలుగు వారాలు దాటి ఇంకా ఎక్కువ రన్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.ఇంత స్టడీ రన్ మన టాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా ఈమధ్య రాలేదని అంటున్నారు.

ఈ సినిమా 27 వ రోజున అనగా ఈరోజు కూడా ఈ చిత్రానికి దాదాపుగా 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట.ఫ్లో చూస్తూ ఉంటే ఇప్పట్లో ఈ సినిమా రన్ ఆగేలా లేదు.ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వెర్షన్ కి కలిపి 24 కోట్ల రూపాయిలు వచ్చాయట.అలా తమిళ వెర్షన్ కి కూడా కలిపితే 62 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు సమాచారం.

ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫార్చ్యూన్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఈ సినిమా నిర్మాణం లో ఒక భాగం.మొత్తం మీద ఈ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపుగా 30 కోట్ల రూపాయిల లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది.ఇంకా మంచి రన్ ఉండే సూచనలు ఉండడం తో ఫుల్ రన్ లో 65 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Viral news News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు