బాధిత కుటుంబాలకు కేజ్రీవాల్ మార్క్ సాయం

గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఢిల్లీ మారణహోమం గురువారానికి కొంతవరకు సద్దుమణిగాయి.అయితే గొడవల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదేవిధంగా చనిపోయిన వారిలో మైనర్లు ఉంటే వారి కుటుంబాలకు 5 లక్షలు, ఇళ్లు, షాప్ లు అలర్లలో ధ్వంసమై నష్టపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ప్రకటించారు. దాడుల్లో చాలా మంది రిక్షావాలా పై […]

  • Written By: Neelambaram
  • Published On:
బాధిత కుటుంబాలకు కేజ్రీవాల్ మార్క్ సాయం


గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఢిల్లీ మారణహోమం గురువారానికి కొంతవరకు సద్దుమణిగాయి.అయితే గొడవల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన బాధితులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అదేవిధంగా చనిపోయిన వారిలో మైనర్లు ఉంటే వారి కుటుంబాలకు 5 లక్షలు, ఇళ్లు, షాప్ లు అలర్లలో ధ్వంసమై నష్టపోయిన వారందరికీ 5 లక్షల రూపాయలు ప్రకటించారు. దాడుల్లో చాలా మంది రిక్షావాలా పై అటాక్ జరిగింది. రిక్షా కోల్పోయిన వారికి 25 వేలు, పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి ఒక్కో జంతువుకు 5 వేలు ప్రభుత్వం ఇస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఇళ్లు ధ్వంసమైన వారిలో కిరాయికి ఉన్న వాళ్లు ఉంటే వారికి రూ.లక్ష ఇవ్వనున్నారు. గాయపడిన వారందరికి మెడికల్ బిల్లుల్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. బాధితులందరికీ మామూలు పరిస్థితి నెలకొనే వరకు ఫ్రీ గా ఫుడ్ అందిస్తామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఎలాంటి రాజకీయాలు చేయకూడదు కాబట్టి ఈ హింసలో ఎవరి ప్రమేయం ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని సీఎం అన్నారు. ఒకవేళ ఆప్ నేతల హస్తం ఉన్నట్లు తేలితే రెండింతల శిక్ష వేయాలని కేజ్రీవాల్ చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టం(సిఏఏ) అనుకూల, వ్యతిరేక ఘర్షణలుగా భావించే ఈ హింసాకాండ లో ఇప్పటి వరకు 38మంది చనిపోయారు. వందల మంది గాయాలపాలై ఆసుపత్రులలో చేరారు.

సంబంధిత వార్తలు