Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం లో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుల వ్యవహార శైలి అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. స్కాం వ్యవహారంలో నిందితులు ఫోన్లను ధ్వంసం చేశారు.. ఈ విషయాన్ని ఈడీ తన చార్జ్ షీట్లో పేర్కొన్నది. ఈడి, బోడి అది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఫోన్లను ధ్వంసం చేశారు. అయితే ఫోన్లను ధ్వంసం చేస్తే డాటా రికవరీ కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఫోన్ మార్చవచ్చు. కానీ ఏ మార్చలేరు. ఎందుకంటే సాంకేతిక పరికరాలపై నిఘాకు దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. చాలామందిలో ఏదైనా కేసుకు సంబంధించి నిందితులు ఉపయోగించిన సెల్ ఫోన్లను శాస్త్రీయంగా ధ్వంసం చేస్తే డాటా రికవరీ అసాధ్యమేనా? కొన్ని ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తే ఆధారాలు తుడిచిపెట్టుకుపోయినట్టేనా? అనే సందేహాలు ఉంటాయి. అయితే నిందితులు ఎక్కడో ఒకచోట, ఏదో ఒక సందర్భంలో కీలకమైన ఆధారాన్ని వదిలేస్తారని, దానితో కేసు చేదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Delhi Liquor Scam
ఎలా సాధ్యం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 38 మంది నిందితులు , అనుమానితులు ఈ డీల్ ముగిసేదాకా 170 ఫోన్లు వాడారు. వాటిల్లో కొన్నింటిని ధ్వంసం చేశారు. అయితే చర్చ మొత్తం ఫోన్ డాటా రికవరీ పైనే సాగుతోంది. వాస్తవానికి సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను శాస్త్రీయ పద్ధతుల్లో ధ్వంసం చేస్తే రికవరీ దాదాపుగా అసాధ్యం. నేరానికి పాల్పడగానే, ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ ను ధ్వంసం చేయడమే కాకుండా.. శాస్త్రీయ పద్ధతుల్లో ఆ పని చేస్తే దర్యాప్తు సంస్థ ఎంతటి అధునాతన పరిజ్ఞానం ఉపయోగించినప్పటికీ డేటా రికవరీ సాధ్యం కాదు. దీనికోసం తిరిగి రాయగలిగే ఆధారాలను, చెరిపి వేయగలిగే మెమొరీకి సంబంధించిన లాజికల్ గేట్ నాన్డ్ ను తొలగిస్తారు. లేదా అందులో డాటా చెరిపేస్తారు.. ఇది కేవలం అనుభవజ్ఞులైన నిపుణులకు మాత్రమే సాధ్యం. స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో నాన్డ్ ను జీరో ఫిల్లింగ్ చేస్తే డాటా రికవరీ అసాధ్యమే. ఫోరెన్సిక్ నిపుణులు ఎంతటి శక్తివంతమైన డాటా రికవరీ సాఫ్ట్వేర్లు వాడినప్పటికీ పాత డాటా తిరిగిరాదు.. ఫోన్ లేదా ల్యాప్ టాప్ ను ధ్వంసం చేసే ముందు జీరో ఫిల్లింగ్ కు పాల్పడితే దర్యాప్తు అధికారులు ఆయా పరికరాలను రికవరీ చేసినా.. వాటిలో ఎలాంటి ఆధారాలు సేకరించలేరు.
స్మార్ట్ ఫోన్ యుగంలో .
స్మార్ట్ ఫోన్ యుగంలో ఏదైనా కొత్త ఫోన్ కొనుగోలు చేసి, దానిని వాడాలంటే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకు జీ మెయిల్ లేదా ఆయా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి కంపెనీ అకౌంట్ ను ముందుగా ఎంటర్ చేయాలి. ఆపిల్ ఫోన్లలో ఆపిల్ ఐడి తప్పనిసరి. కానీ డమ్మీ ఎకౌంట్లతో లాగిన్ అయినా, లాగిన్ ఆప్షన్ ను స్కిప్ చేసినా ప్రత్యామ్నాయ మార్గాల్లో డాటా సేకరణకు దారులు మూసుకుపోయినట్టే. ఇక ఫోన్ ధ్వంసం చేసే ముందు అంతర్జాతీయ మొబైల్ గుర్తింపు సంఖ్య ను క్లోన్ చేసినా డాటా రికవరీ కష్టం. ఇలాంటి సమయంలో నిందితులు ఫోన్లను మామూలుగా ధ్వంసం చేస్తే డాటా రికవరీ సులభం అని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

mlc kavitha
శాస్త్రీయంగా ఫోన్లను ధ్వంసం చేసినా, వారు మాట్లాడిన లేదా చాటింగ్ చేసిన లేదా ఎస్ఎంఎస్ పంపిన వ్యక్తుల ఫోన్ల ద్వారా కూడా ఆధారాలు రికవరీ చేయొచ్చు.. ఇవే కాకుండా నిందితుల గూగుల్ బ్యాకప్, క్లౌడ్ మెమొరీ దగ్గర్నుంచి డాటా రాబట్టొచ్చు. ఇక సెల్ఫోన్, లాప్టాప్, డెస్క్టాప్ ద్వారా ఇంటర్నెట్ వినియోగం వంటి అంశాలపై నిఘా కొనసాగించేందుకు భద్రత కారణాల దృష్ట్యా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి 10 కీలక దర్యాప్తు సంస్థలకు కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.. ఆయా దర్యాప్తు సంస్థలు దేశ భద్రతలో భాగంగా నిఘా కొనసాగిస్తాయి. అవసరం అనుకుంటే కేంద్ర హోంశాఖ అనుమతితో ఫోన్లను ట్యాప్ చేస్తాయి. అయితే ఇందులో ఒక కిటుకు ఉంది. సదరు నిందితులు దేశ భద్రతకు ఎలా మప్పుగా పరిణమిస్తున్నారనే వివరాలను కేంద్ర హోం శాఖకు సమర్పించాల్సి ఉంటుంది.. అయితే లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల అధికారులు నిందితులు ధ్వంసం చేసిన ఫోన్ల నుంచి డాటా ఎలాంటి పద్ధతిలో రికవరీ చేస్తారని దానిపైనే ఈ కేసు భవితవ్యం ఆధారపడి ఉంది.