Deepthi Sunaina: బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైన సోషల్ మీడియా ఫ్రీక్. ఆమె తరచుగా హాట్ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తారు. అలాగే సెగలురేపే స్టెప్స్ వేస్తూ డాన్స్ వీడియోలు పంచుకుంటున్నారు. దీప్తి సునైనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియో పోస్ట్ చేయగానే అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ బోల్డ్ డాన్స్ వీడియోతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. నడుము, నాభి చూపుతూ మెస్మరైజ్ అయ్యేలా స్టెప్స్ వేశారు. నడుము బొంగరంగా తిప్పుతూ డాన్స్ చేస్తుంటే నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ నడుమెక్కడ చేయించిందిరా బాబు అంత అందంగా ఉంది అంటున్నారు.

Deepthi Sunaina
దీప్తి సునైన బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్నారు. టాప్ సెలెబ్రిటీలు పాల్గొన్న ఆ సీజన్లో దీప్తి ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టింది. యూట్యూబ్ జనాలకు తప్పితే ఆమె గురించి పబ్లిక్ కి పెద్దగా తెలియదు. అయినప్పటికీ తన గేమ్ తో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రుజువు చేసుకుంది. దీప్తి ఏకంగా 10 వారాలు హౌస్లో ఉంది. ఆ సీజన్ విన్నర్ కౌశల్ కాగా రన్నర్ గా సింగర్ గీతా మాధురి నిలిచారు. ఇక బిగ్ బాస్ అనంతరం దీప్తి పాపులారిటీ బాగా పెరిగింది.
యూట్యూబ్ నటిగా ఆమె అనేక షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లలో నటించారు. అలాగే డాన్స్ నంబర్స్ చేశారు. మరో యూట్యూబర్ షణ్ముఖ్ తో కలిసి సంచలనాలు నమోదు చేశారు. యూట్యూబ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీప్తి -షణ్ముఖ్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఉంది. ఇద్దరూ కలిసి అనేక డాన్స్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేశారు. ఆ క్రమంలో ప్రేమలో పడ్డారు. ఏళ్ల తరబడి ప్రేమించుకున్న దీప్తి-షణ్ముఖ్ 2021లో బ్రేకప్ చెప్పుకున్నారు.

Deepthi Sunaina
షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు దీప్తి సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. విడిపోయి ఏడాది దాటిపోగా తిరిగి కలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కలిసి ఒకటి రెండు షోలు చేశారు. అలాగే కలిసి నటిస్తున్నట్లు సమాచారం. దీప్తికి షణ్ముఖ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పాడు. వీరి అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో సన్నిహితంగా మెలిగాడు. అది నచ్చని దీప్తి బ్రేకప్ చెప్పిందనే వాదన ఉంది.
View this post on Instagram