Deepika Padukone Oscars 2023: ఆస్కార్ ప్రజెంటర్‌గా మన స్టార్!
Deepika Padukone Oscars 2023: ఈనెల 12న లాస్ ఏంజెల్స్‌లో జరిగే 2023 ఆస్కార్ అవార్డుల వేడుక కోసం భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి ఉన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ చిత్రం అవార్డుల రేసులో నిలవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకొని ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయింది. దాంతో, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ […]


Deepika Padukone Oscars 2023
Deepika Padukone Oscars 2023: ఈనెల 12న లాస్ ఏంజెల్స్‌లో జరిగే 2023 ఆస్కార్ అవార్డుల వేడుక కోసం భారతీయులంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి ఉన్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆర్ఆర్ఆర్ చిత్రం అవార్డుల రేసులో నిలవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకొని ఆస్కార్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయింది. దాంతో, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీ పడుతోంది. నాటునాటుకు ఆస్కార్ రావాలని భారతీయులంతా కోరుకుంటున్నారు.
సందడి చేయనున్న దీపిక..
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొణె ఆస్కార్ 2023 వేడుకలో సందడి చేయబోతుంది. ఈ అవార్డ్స్ వేడుకకు దీపిక అవార్డ్‌్స ప్రజెంటర్‌గా హాజరు కానుంది. ఈ ఏడాది ఇండియా నుంచి ఈ ఘనతను సొంతం చేసుకున్న ఏకైక నటిగా దీపికా పడుకొణె నిలిచింది. ఆస్కార్ నిర్వాహకులు ప్రకటించిన ప్రజెంటర్స్ జాబితాలో డ్వేన్ జాన్సన్, ఎమిలీ బ్లంట్, రిజ్ అహ్మద్, శ్యామూల్ ఎల్.జాక్సన్, గ్లెన్ క్లోజ్, మైఖేల్ బి జోర్డాన్, జోనాథన్ మేజర్స్ లాంటి హాలీవుడ్ నటీమణులతో కలిసి దీపికా పడుకోణ్ స్థానాన్ని దక్కించుకుంది. విజేతలకు ఈ దిగ్గజ నటులతో కలిసి దీపికా అవార్డ్స్ ప్రధానం చేయనుంది.

Deepika Padukone Oscars 2023
రెండో ఇండియన్..
ఆస్కార్ అవార్డ్స్ ప్రజెంటర్‌గా వ్యవహరించనున్న రెండో ఇండియన్ నటిగా దీపికా పడుకొణె నిలవనుంది. 2016 ఆస్కార్స్ ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విజేతగా అవార్డును అందజేసింది. ప్రియాంక తర్వాత దీపికా పడుకొణెకే అవకాశం దక్కింది. ఈనెల 12న నిర్వహించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై దీపికా మెరవనుంది. కాగా, ఇండియా నుంచి ఆస్కార్‌కు ఆర్ఆర్ఆర్ సినిమా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో రాజమౌళి సినిమా పోటీపడనుంది.
