Vijay Antony: స్టార్ హీరో కుమార్తె ఆత్మహత్య.. కారణం ఏంటంటే?
16 ఏళ్ల మీరా ఆంటోని చర్చ్ పార్క్ స్కూల్ 12వ తరగతి చదువుతుంది. విజయ్ ఆంటోని చాలా కాలంగా చెన్నై ఆళ్వార్ పేటలోని డీడీకే రోడ్డులో గల ఇంటిలో నివాసం ఉంటున్నారు.

Vijay Antony: కోలీవుడ్ హీరో… దర్శక నిర్మాత విజయ్ ఆంటోని ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విజయ్ ఆంటోని 2006లో ఫాతిమా అనే యువతిని పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు అని సమాచారం. పెద్దమ్మాయి మీరా ఆంటోని కాగా చిన్న కూతురు పేరు లారా ఆంటోని.

Vijay Antony
16 ఏళ్ల మీరా ఆంటోని చర్చ్ పార్క్ స్కూల్ 12వ తరగతి చదువుతుంది. విజయ్ ఆంటోని చాలా కాలంగా చెన్నై ఆళ్వార్ పేటలోని డీడీకే రోడ్డులో గల ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈ ఇంట్లోనే మీరా ఆంటోని ఆత్మహత్యకు పాల్పడింది. తన గదిలో ఆమె తెల్లవారు ఝామున ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మీరా ఆంటోని మరణించినట్లు వైద్యులు వెల్లడించారట.
ఆ సమయంలో విజయ్ ఆంటోని ఇంట్లో లేరని సమాచారం. మీరా మరణానికి చదువు ఒత్తిడే కారణం అని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజర్. అలాగే దర్శకుడు, నిర్మాత కూడాను. ఆయన నటించిన సలీం, బిచ్చగాడు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా బిచ్చగాడు తెలుగులో భారీ విజయం అందుకుంది.
ఇటీవల బిచ్చగాడు సీక్వెల్ విడుదల చేసి విజయం సాధించాడు. బిచ్చగాడు 2 సైతం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. చాలా సింపుల్ గా ఉండే విజయ్ ఆంటోనికి మంచి వ్యక్తిగా పేరుంది. అలాంటి హీరో కుటుంబంలో చోటు చేసుకున్న ఈ విషాదం తీవ్ర వేదనకు గురి చేస్తుంది. అభిమానులు, చిత్ర ప్రముఖులు తమ సంతాపం ప్రకటిస్తున్నారు.
