Space Debris: ఇన్నాళ్లు మనం నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, భూమి కాలుష్యం గురించే చదువుకున్నాం.. ఇప్పుడు టెక్ యుగంలో ఉన్నాం కనుక “ఈ_ కాలుష్యం” గురించి కూడా చర్చించుకుంటున్నాం.. ఈ కాలుష్యాల వల్ల మనిషి మనగడకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.. వీటి నివారణ కోసం ఎన్నెన్ని చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు.. అయితే ఇన్నాళ్లు మనం ఉంటున్న ఈ భూమిపై ఏర్పడుతున్న కాలుష్యాల గురించే తెలుసుకున్నాం. కానీ అంతరిక్షంలో కూడా కాలుష్యం ఉంటుందన్న విషయం మీకు తెలుసా? అంతరిక్షం ఇప్పుడు అనేక చెత్తతో నిండిపోయిందని మీకు తెలుసా? ఆ చెత్త వల్ల ప్రపంచ దేశాలకు ముప్పు ఉందని మీకు తెలుసా?

Space Debris
అంతరిక్షంలో పేరుకుపోతున్న చెత్త వివిధ దేశాలకు సవాల్ విసురుతోంది.. ప్రస్తుతం రోదసీలో 3,409 శాటిలైట్లు చెత్తగా మారిపోయాయి.. ఇవి కాకుండా దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు, మిలియన్ల కొద్దీ చిన్నపాటి ముక్కలు అంతరిక్షాన్ని కమ్మేశాయి.. 2030 నాటికి రోదసీలో ఉండే శాటిలైట్ల సంఖ్య 58 వేలను దాటిపోవచ్చని ఒక అంచనా.. దీనివల్ల గగనతలం భవిష్యత్తులో పెద్దముప్పునే ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది.
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి చరిత్రను సమూలంగా మార్చేశాయి.. ఉపగ్రహాల వినియోగంతో టీవీ, ఫోన్, ఇంటర్నెట్, జిపిఎస్ తదితర సేవలతో పాటు ఎప్పటికప్పుడు మార్పులను ముందే పసిగట్టి సమాచారాన్ని అరచేతిలో చూడగలుగుతున్నాం. ఇదంతా కూడా శాటిలైట్స్ వల్లే సాధ్యమైంది. సోవియట్ యూనియన్ 1957 అక్టోబర్ 4న స్పుత్నిక్ శాటిలైట్ ప్రయోగంతో అంతరిక్ష యుగం మొదలైంది.. వివిధ దేశాల ఆధ్వర్యంలో మాత్రమే శాటిలైట్ ప్రయోగాలు కొనసాగాయి.. ఇటీవల ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఐక్యరాజ్యసమితి ఔటర్ స్పేస్ అఫైర్స్ విభాగం లెక్కల ప్రకారం 2022 జనవరి నాటికి భూమి చుట్టూ 8,261 ఉపగ్రహాలు తిరుగుతున్నాయి.. ఆర్యభట్టతో 1975 ఏప్రిల్ 19 న తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన భారత్.. ఇప్పటివరకు 180 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది.. ఇవి కాక సుమారు 38 దేశాలకు చెందిన 350 కి పైగా శాటిలైట్లను అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టింది.. మన దేశ శాటిలైట్ లలో 40 వరకు సేవలందిస్తున్నాయి.. మిగిలినవి విశ్వంలో నిరుపయోగంగా ఉన్నాయి.

Space Debris
ప్రపంచ దేశాలు పోటీపడి మరీ పంపిస్తున్న శాటిలైట్లతో అంతరిక్షంలో ట్రాఫిక్ పెరిగిపోతుంది.. కాలం చెల్లిన శాటిలైట్లు, రాకెట్ల శిథిలాలతో అంతరిక్షం చెత్తకుప్పగా మారిపోతుంది.. స్పేస్ లో ఉన్న మొత్తం 8,
261 శాటిలైట్ లలో ప్రస్తుతం 4,852 మాత్రమే సేవలు అందిస్తున్నాయి.. మిగిలినవి నిరుపయోగమై వ్యర్ధాలుగా మారాయి.. ఇవి కాకుండా రాకెట్ల నుంచి రాలి పడిన దాదాపు 34 వేల స్పేస్ జంక్ ముక్కలు మిలియన్ల కొద్దీ చిన్న ముక్కలు అంతరిక్షం చుట్టూ పేరుకు మపోయాయి. అమెజాన్ స్పేస్ ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షంలో అడుగుపెట్టి సాటిలైట్ల ప్రయోగాలు చేసేందుకు పోటీ పడుతున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో 2030 నాటికి రోదసీలోకి ప్రవేశపెట్టే శాటిలైట్ల సంఖ్య 58వేలకు పైగా దాటిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అంతరిక్షంలో స్పేస్ ట్రాఫిక్ పెరిగిపోవడంతో పాటు డెబ్రిస్ తో నిండిపోతుందని ఒక అంచనా.
అంతరిక్షంలో ఉపగ్రహాలు తిరిగే వృత్తాకార మార్గాన్ని కక్ష అంటారు.. సాటిలైట్స్ మూడు రకాల ఆర్బిట్స్ లో ఉంచుతారు. ఇవి భూమి నుంచి మూడు వేల కిలోమీటర్ల వరకు లోయర్ ఆర్బిట్, 700 నుంచి 1000 కిలోమీటర్ల వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఆర్బిట్స్, 36వేల కిలోమీటర్ల జియో సింక్ర నైజ్ ఆర్బిట్ ఉంటాయి.. ఏటా వందల సంఖ్యలో శాటిలైట్లను కక్షలో పంపడం ద్వారా వాటి మధ్య దూరం తగ్గిపోయి స్పేస్ ట్రాఫిక్ ఏర్పడుతోంది.. దీంతో కొత్త ఉపగ్రహాలను పంపేటప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అంతరిక్షంలో రాకెట్ పరికరాల శిథిలాలను స్పేస్ డెబ్రీస్ అంటారు.. అంతరిక్ష శిధిలాలు 700 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి..
వాస్తవానికి అంతరిక్ష వ్యర్ధాల్లో మూడింట ఒక భాగం అమెరికా, రష్యాలవే. వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న వాటిని తొలగించడం కత్తి మీద సామయింది.. దీంతో అమెరికా వివిధ దేశాల స్పేస్ శాస్త్రవేత్తలతో 1993 ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రిస్ కో_ ఆర్డినేషన్ కమిటీ నియమించింది.. ఐక్యరాజ్యసమితి 1959 లోనే అవుటర్ స్పేస్ శాంతియుత ఉపయోగాల కమిటీ ని నియమించింది.. ఈ రెండు కమిటీల్లోనూ భారత్ ప్రారంభ సభ్య దేశంగా ఉంది.. ఈ కమిటీల్లోని శాస్త్రవేత్తలు అంతరిక్ష శిథిలాల తొలగింపు పై ఓ నివేదికను రూపొందించాయి.. దీని ప్రకారం అధునాతన రాడార్లు, టెలిస్కోపులను ఉపయోగించి అంతరిక్ష వ్యర్ధాలను పసిగట్టి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు.. కాలం చెల్లిన శాటిలైట్లను కక్ష నుంచి తప్పించి వాతావరణంలోకి ఇచ్చే యోచన జరుగుతున్నది. స్పేస్ డెబ్రిస్ ను తొలగించే యంత్రాంగం ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశం వద్ద కూడా లేదు.