Zombie Virus: హాలీవుడ్ లో జాంబీస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులో కూడా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో గత ఏడాది జాంబీరెడ్డి సినిమా వచ్చింది.. ఆ సినిమాల్లో జాంబీలు కరిచిన మనుషులు ఇతర మనుషులను చంపుతారు. చూసేందుకు అవి రాంగ్ టర్న్, ఈవిల్ డెడ్ సినిమాల మాదిరి కనిపించినా… అలాంటి ఘటనలు జరుగుతాయా అనేది చాలామందికి అనుమానం ఉండేది. కానీ నిజంగానే జాంబీ వైరస్ ఉందట. 48,500 సంవత్సరాల క్రితం ఈ వైరస్ రష్యాలోని గడ్డకట్టిన సరస్సు కింద శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేకాదు సిబిరియాలోని ఐరోపా శాస్త్రవేత్తలు ఈ వైరస్ నమూనాలు సేకరించారు.. పరీక్షించిన తర్వాత దీనికి జాంబి వైరస్ అని పేరు పెట్టారు. ఇన్ని సంవత్సరాల పాటు మంచులో కూరుకు పోయినప్పటికీ ఈ వైరస్ కు వ్యాప్తి చెందే గుణం ఇప్పటికీ ఉంది.

Zombie Virus
2013లో..
2013లో ఇదే శాస్త్రవేత్తల బృందం 30 ఏళ్ల నాటి వైరస్ కనుగొన్నారు. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేస్తూ అంతకన్నా పాత వైరస్ ను గుర్తించారు. ఇక ఈ పరిశోధకులు వైరస్ కనుగొన్న ప్రాంతం అతి శీతల ప్రాంతంలో ఉంది.. ఇక్కడ మంచు కూడా త్వరగా కరిగిపోతుందని గుర్తించారు. ఇదే కొనసాగితే వాతావరణ మార్పుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మీథేన్ లాంటి విషవాయువులు గాలిలోకి విడుదలవుతున్న కొద్దీ మానవాళికి ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
ఈ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో
రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి వైరస్ ల గురించి అధ్యయనం చేస్తున్నారు. అయితే మంచు కరిగిపోతున్న కొద్దీ ఇలాంటి వైరస్ లు ఎన్నో బయటపడతాయని వారు చెబుతున్నారు.. ఇటీవల కెనడా ప్రాంతాల్లో ప్రాణాంతక జాంబీ వైరస్ బయటపడింది. ఆ దేశంలోని జింకల్లో ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. జాంబి సినిమాలో చూపించినట్టే ఇక్కడ కూడా జరుగుతున్నది . ఈ వైరస్ జింకల్లో వేగంగా వ్యాపిస్తోంది. 1996లో పశువుల్లో ఈ జాంబి వైరస్ ను గుర్తించారు. పశువుల నుంచి నమూనాల సేకరించి పరీక్షలు నిర్వహించగా బ్యాక్టీరియా, ఇతర వైరస్ ల జన్యు సమాచారం లభించింది.. అప్పట్లో ఆ వ్యాధికి అడ్డుకట్ట వేశారు.. మళ్లీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత జింకల్లో జాంబి వైరస్ బయట పడటం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తుంది.. అయితే ఈ వైరస్ జింకల నుంచి ఇతర జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఇక ఈ ఇన్ఫెక్షన్ సోకిన జంతువు మాంసం తిన్నా, దాని మలమూత్రాలు, లాలాజలం ముట్టుకున్న ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Zombie Virus
ఎన్నో వైరస్ లు తెర పైకి
ప్రస్తుత కాలంలో ఎప్పుడు ఏ వైరస్ వచ్చి దాడి చేస్తుందో అంతు పట్టడం లేదు. కోవిడ్ కథ ప్రపంచవ్యాప్తంగా ముగిసినప్పటికీ… చైనాలో ఇంకా తగ్గడం లేదు. అక్కడ నెలల తరబడి లాక్ డౌన్ లు విధిస్తున్నారు. కోవిడ్ తగ్గింది అనుకుంటే మంకీ ఫాక్స్ కలకాలం రేపుతున్నది. ఇంకా కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాతావరణ మార్పులు కూడా ఇందుకు ఒక కారణం. ఫలితంగా మానవాళి ఏదో ఒక విపత్తును ఎదుర్కొంటూనే ఉంది. అయితే మానవాళికి ప్రమాదం కలిగించే 24 వైరస్ లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే వీటిలో జాంబి వైరస్ కూడా ఉండటం ఇప్పుడు శాస్త్రవేత్తల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.