Nap Benefits: పగటి నిద్రతో మనకు ప్రయోజనాలెన్నో
ప్రస్తుతం పగటి నిద్ర ప్రశాంతతకు మేలు చేస్తుందనేది కొత్త నానుడి. మన శరీరం అలసటకు గురైనప్పుడు నిద్ర రావడం సహజం. దీంతో మనం 25-45 నిమిషాల పాటు నిద్ర పోతే మంచి ఫలితాలు ఉంటాయి.

Nap Benefits: గతంలో మనకు తెలుగులో ఓ పాఠం ఉండేది పగటి నిద్ర పనికి రాదని దాని సారం. అందులో కుందేలు, తాబేలు పోటీ పెట్టుకుంటాయి. దీంతో రెండు తమ గమ్యం చేరేందుకు బయలుదేరతాయి. కానీ కుందేలు మాత్రం తాబేలు వచ్చేసరికి సమయం బాగా అవుతుందని ఓ కునుకు తీస్తుంది. దీంతో తాబేలు మెల్లగా నడుస్తూ చేరాల్సిన గమ్యం చేరుతుంది. ఇలా పగటినిద్ర పనికి రాదని దాని సారాంశం.
ప్రస్తుతం పగటి నిద్ర ప్రశాంతతకు మేలు చేస్తుందనేది కొత్త నానుడి. మన శరీరం అలసటకు గురైనప్పుడు నిద్ర రావడం సహజం. దీంతో మనం 25-45 నిమిషాల పాటు నిద్ర పోతే మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా మధ్యాహ్న నిద్ర మనకు ప్రయోజనాలు కలిగిస్తుందని చెబుతున్నారు. దీని వల్ల మన శరీరంలో రీఫ్రెష్ పెరిగి చేసే పనిలో ఉత్సాహం కలుగుతుంది.
మధ్యాహ్నం నిద్రతో మనకు కొత్త శక్తి వస్తుంది. దీని వల్ల చేసే పనిలో ఇంకా శక్తి పెరుగుతుంది. దీని వల్ల చేసే పని మరింత ముందుకెళ్తుంది. పగటి సమయంలో నిద్ర పోవడం వల్ల మనకు లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుందని నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే పగటి నిద్రతో మనం లాభపడతాం. దీంతోనే మనకు ప్రయోజనాలు దక్కుతాయి. అందుకే పగలు సమయంలో నిద్రపోవడానికి చొరవ తీసుకోవాలి.
మధ్యాహ్నం సమయంలో నిద్ర పోతే మన శరీరం ఎంతో రిలాక్స్ అవుతుంది. శరీరం అలసటకు గురైన సమయంలో కాస్త విశ్రాంతి తీసుకుంటే మళ్లీ పనులు చేసేందుకు సంసిద్ధమవుతుంది. దీని వల్ల మనకు మేలు కలుగుతుంది. ఇలా పగటి నిద్ర మనకు మంచి చేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి మధ్యాహ్నం నిద్ర మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
