Custody Trailer : నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ ఖచ్చితంగా గెలుస్తుంది.. కట్టిపడేసిన ‘కస్టడీ’ ట్రైలర్
ఇందులో నాగచైతన్య ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ గా నటించాడని అర్థం అవుతుంది. ఒక క్రిమినల్ (అరవింద్ గో స్వామి) చేసే హత్యలను గమనించి అతనిని అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఎదురైనా సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్థం అవుతుంది.

Custody Trailer (Telugu) Review : అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ ఈ నెల 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తో పాటుగా తమిళం లో కూడా విడుదల అవ్వబోతుంది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో తమిళ సీనియర్ హీరో అరవింద్ గో స్వామి విలన్ గా నటించాడు.
ఇది వరకే ఆయన తెలుగు లో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధ్రువ’ చిత్రం లో విలన్ గా చేసాడు.ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆయన తెలుగు తెరపై కనిపించబోతున్న సినిమా ఇదే. ఇందులో ఆయనతో పాటుగా మరో తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ మరియు ప్రియమణి కూడా ముఖ్యపాత్రలు పోషించారు.ఇది వరకే విడుదలైన టీజర్ తోనే ప్రేక్షకుల దృష్టికిని ఆకర్షించిన ఈ సినిమా కి సంబందించిన ట్రైలర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.ఈ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లో చూద్దాము.
ట్రైలర్ చూస్తూ ఉంటే ఇందులో నాగచైతన్య ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ గా నటించాడని అర్థం అవుతుంది. ఒక క్రిమినల్ (అరవింద్ గో స్వామి) చేసే హత్యలను గమనించి అతనిని అరెస్ట్ చేసి, ఆ తర్వాత ఎదురైనా సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అర్థం అవుతుంది. ట్రైలర్ చూస్తున్నంతసేపు ఎంతో ఆసక్తికరంగా అనిపించింది, ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇందులో శరత్ కుమార్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు.ఇక కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యే హీరోయిన్ లాగ కాకుండా ఈసారి కృతి శెట్టి కి కూడా మంచి పాత్ర దక్కిందనే చెప్పాలి.
హీరో నాగ చైతన్య కి కూడా చాలా కాలం తర్వాత నటనకి ప్రాముఖ్యం ఉన్న పాత్ర పోషించాడు.ఇక అరవింద్ గో స్వామి పాత్ర గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు,ట్రైలర్ లోనే ఆయన భయపెట్టేసాడు. ఒక దొంగ ని పోలీస్ స్టేషన్ నుండి పారిపోకుండా చివరి వరకు కాపాడుకుంటూ, కోర్టు లో అతనిని సబ్మిట్ చేసే విధంగా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది.ఇలాంటి సినిమాలను ఆసక్తికరంగా తియ్యడం లో డైరెక్టర్ వెంకట్ ప్రభు సిద్ధహస్తుడు.మరి ఆయన ఏ రేంజ్ లో తీసాడో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.
