Site icon OkTelugu

Advocate Khaja Moinuddin: చట్టాల మీద గౌరవం లేదు.. భయం అంతకంటే లేదు.. లాయర్లను వదలరా? ఇంత క్రూరమా..

Advocate Khaja Moinuddin

Advocate Khaja Moinuddin

Advocate Khaja Moinuddin: సినిమాల్లో హీరో, విలన్ మధ్య పోరాటాలు జరుగుతుంటాయి. ముందుగా విలన్ హీరోను అంతం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ తర్వాత హీరో విలన్ ను చంపేస్తుంటాడు.. వీరిద్దరి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు వీరోచితంగా ఉంటాయి. విలన్ గాని.. హీరో గాని ఎంతటి హింసాత్మక ఘటనలకు పాల్పడినప్పటికీ పోలీసులు పట్టించుకోరు. మన వ్యవస్థలు ఏమి చేయలేవు. జస్ట్ వాళ్లు కొట్టుకుంటుంటే.. చుట్టుపక్క వారు వినోదం చూస్తుంటారు. చివరికి హీరో విలన్ ను చంపేసి సినిమాకు శుభం కార్డు వేస్తుంటాడు. ఒక మనిషిని చంపినప్పటికీ కూడా హీరో మీద ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోరు.

సినిమాలంటే కల్పితాలు కాబట్టి అలా జరిగిపోతూ ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో కూడా అలా జరిగితే దాన్ని ఏమనాలి.. అప్పట్లో మంథని ప్రాంతంలో న్యాయవాద దంపతులను నడిరోడ్డు మీద నరికి చంపారు. పాతబస్తీలో ఇంకా అనేక రకాల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంది. అవన్నీ కూడా సభ్య సమాజంలో భయం కలిగించాయి. నేరాలు జరిగిన తర్వాత.. వాటికి పాల్పడిన వారి మీద న్యాయస్థానాలు.. పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. వారికి శిక్ష పడేలా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ చాలామందిలో మార్పు రావడం లేదు. పైగా చట్టం అంటే భయం లేదు. పోలీసులంటే వణుకు లేదు. సాటి మనుషుల ప్రాణాలు అంటే ఏమాత్రం లెక్కలేదు. దూకుడుగా వస్తున్నారు. దాడులు చేసి చంపేస్తున్నారు. చివరికి తమ పగ చల్లారని తర్వాత పోలీసుల ముందు లొంగిపోతున్నారు.

తాజాగా హైదరాబాదులో మాసాబ్ ట్యాంక్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో కాజా మొయినుద్దీన్ అనే అడ్వకేట్ ఉన్నారు. తన ఇంటి ముందు ఆయన కారులో ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా.. కొంతమంది కారుతో వేగంగా వచ్చి గుద్దేశారు. దీంతో మొయినుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.. ఈ సంఘటన హైదరాబాద్ నగరవాసుల్లో భయాన్ని కలిగించింది. ఈ తరహా సంఘటనలు ఇటీవల కాలంలో విరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఈ ఘటన కంటే ముందు ఒకరోజు విజయవాడ నగరంలో ఇద్దరు యువకులు పరస్పరం వాహనాలతో ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. అయినప్పటికీ జనాలలో మార్పు రావడం లేదు. సినిమాలు.. పాత పగలు.. వ్యక్తిగత కక్షలు.. కారణాలు ఏమైనా సరే సాటి మనుషులను చంపడానికి.. అత్యంత క్రూరంగా హింసించడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.

పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ.. న్యాయస్థానాలు శిక్షలు విధిస్తున్నప్పటికీ.. ప్రజల్లో పెద్దగా మార్పు రావడం లేదు. పైగా దారుణాలకు పాల్పడే తీరు మరింత తీవ్రంగా ఉంటున్నది. హింస కూడా అధిక స్థాయిలో ఉంటున్నది.

Exit mobile version