World Cup 2023: రోహిత్ శర్మకు ఎసరు పెట్టిన డికాక్…
ఒక వరల్డ్ కప్ టోర్నీలో ఇంతవరకు అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.ఇంతకు ముందు 2019 వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీ లో రోహిత్ శర్మ 9 మ్యాచ్ ల్లోనే 5 సెంచరీలు చేసి 648 పరుగులను సాధించాడు.

World Cup 2023: ఈ వరల్డ్ కప్ టోర్నీలో సౌతాఫ్రికా టీమ్ వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇలాంటి క్రమంలో సౌతాఫ్రికా టీమ్ కి చెందిన క్వింటన్ డికాక్ వరుసగా సెంచరీ లను చేస్తూ ఆ టీమ్ కి మంచి విజయాలను అందిస్తున్నాడు. ఇప్పటికే డికాక్ ఏడు మ్యాచ్ ల్లో 545 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు. అలాగే ఈ టోర్నీ లో 4 సెంచరీ లు చేసి ఇప్పటి వరకు అత్యధిక సెంచరీ లు చేసిన ప్లేయర్ గా కూడా తానే ముందు వరుస లో ఉన్నాడు. అయితే డికాక్ వరుసగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్ లాంటి టీమ్ లా మీద నాలుగు సెంచరీలు నమోదు చేశాడు…
ఒక వరల్డ్ కప్ టోర్నీలో ఇంతవరకు అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా రోహిత్ శర్మ నిలిచాడు.ఇంతకు ముందు 2019 వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీ లో రోహిత్ శర్మ 9 మ్యాచ్ ల్లోనే 5 సెంచరీలు చేసి 648 పరుగులను సాధించాడు.దానికి తగ్గట్టుగానే డికాక్ కూడా వరుసగా సెంచరీ లను చేస్తూ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు.డికాక్ ఇంకొక్క సెంచరీ చేస్తే రోహిత్ శర్మతో పాటు సమంగా మారిపోతాడు, ఇంకో రెండు సెంచరీ లు చేస్తే రోహిత్ శర్మ రికార్డ్ ను బ్రేక్ చేసి తను కొత్త రికార్డుని క్రియేట్ చేస్తాడు…ఇక ప్రస్తుతం డికాక్ ఉన్న ఫామ్ ని బట్టి చూస్తుంటే ఇంకో రెండు సెంచరీలు ఈజీగా చేసే విధంగానే కనిపిస్తున్నాడు…
ప్రస్తుతం డికాక్ సౌతాఫ్రికా టీం లో కీలకమైన ప్లేయర్ గా మారాడు. డికాక్ వరుస గా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడటం వల్లే సౌతాఫ్రికా మంచి విజయాలను అందుకుంటుంది.ఇక ఇలాంటి క్రమంలో గత కొద్దిరోజులుగా డి కాక్ ఫామ్ లో లేడు అయినప్పటికీ వరల్డ్ కప్ లో మంచి ఫామ్ లోకి వచ్చి వరుసగా సెంచరీలు చేస్తూ టీమ్ ని విజయతీరాలకు చేరుస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో సౌతాఫ్రికా సెమిస్ లోకి కూడా అడుగుపెట్టబోతుంది.ఇక ప్రస్తుతం ఈ టోర్నీ లో సౌతాఫ్రికా టీం నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది ఇక సౌతాఫ్రికా ఆల్మోస్ట్ సెమీస్ లోకి వెళ్లిపోయింది…
ఇక సెమిఫైనల్ లో కూడా గెలిచి ఫైనల్ కి వెళ్లి అక్కడ విజయం సాధించాలి అని చూస్తుంది. వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సౌతాఫ్రికా ఒక్క వరల్డ్ కప్ కూడా కొట్టలేదు దాంతో ఈసారి అయిన వరల్డ్ కప్ గెలవాలనే దృఢ సంకల్పంతో సౌతాఫ్రికా టీమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతిసారి సౌతాఫ్రికా సెమీఫైనల్ దాకా వస్తుంది ఓడిపోయి ఇంటికి వెళ్తుంది కానీ ఈసారి మాత్రం కప్పు కొట్టడమే లక్ష్యం గా పెట్టుకొని వాళ్ళు ముందుకు కదులుతున్నట్టు గా కనిపిస్తున్నారు… చూడాలి మరి సౌతాఫ్రికా ఈసారి అయిన కప్పు కొడుతుందా లేదా అనేది…
