WhatsApp: వాట్సాప్ లో రెండు అకౌంట్లు.. ఇలా క్రియేట్ చేసుకోండి..
వాట్సాప్ కు అడిక్ట్ అయిన వాళ్ళు ఒక్క గంట సేపు పని చేయకపోతే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెటా సంస్థ ఈ యాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది.

WhatsApp: మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు వాట్సాప్ ను రోజుకు ఒక్కసారి కూడా చూడలేక ఉండలేరు. వినియోగదారులకు అనుగుణంగా మెటా సంస్థ కొత్త కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చి ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఫీచర్ ను అప్డేట్ చేసింది. ఇప్పటి వరకు ఒక మొబైల్ లో ఒకే వాట్సాప్ ను ఉపయోగించే వీలుండేది. కానీ ఇప్పుడు రెండు వాట్సాప్ లు ఉపయోగించవచ్చు. డిఫరెంట్ ఖాతాల ద్వారా డిఫరెంట్ వ్యక్తులతో చాట్ చేయొచ్చు.. మెసేజ్ లు పెట్టుకోవచ్చు. మరి దీని గురించి తెలుసుకుందామా…
వాట్సాప్ కు అడిక్ట్ అయిన వాళ్ళు ఒక్క గంట సేపు పని చేయకపోతే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మెటా సంస్థ ఈ యాప్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తోంది. యూజర్స్ ఖాతాలకు సెక్యూరిటీ ఇస్తూ వారికి కావాల్సిన సదుపాయాలు అందిస్తుంది. మొన్నటి వరకు వాట్సాప్ స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఒకే వాట్సాప్ లో రెండు వేర్వేరు ఖాతాలను క్రియేట్ చేసుకొని డిఫరెంట్ వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు. మరి దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే?
వాట్సాప్ లో పై భాగంలో క్యూఆర్ కోడ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్యూఆర్ కోడ్ వద్ద ‘యారో(బాణం)’ ఐకాన్ సాయంతో కొత్త అకౌంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు డూబ్లికేట్ వాట్సాప్ ను క్రియేట్ చేసుకొని రెండు ఖాతాలను నిర్వహించుకున్నారు. కానీ ఇలా చేయడం వల్ల భద్రతా పరమైన సమస్యలు వస్తున్నాయి. దీంతో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల వ్యక్తులు తమ పర్సనల్ కు ఒక ఖాతాను, వృత్తికి పరమైన మరో ఖాతాను ఏర్పాటు చేసుకోవచ్చు.
