Rajinikanth – Balakrishna: సూపర్ స్టార్ రజినీకాంత్ – నందమూరి బాలకృష్ణ మల్టిస్టార్రర్ చిత్రం గురించి క్రేజీ అప్డేట్!

బాలకృష్ణ కి అటు రజినీకాంత్ తో ఇటు శివరాజ్ కుమార్ తో దశాబ్దాల నుండి ఎంతో మంచి స్నేహం ఉంది. వీళ్ళిద్దరితో ఆయన తన సొంత కుటుంబ సభ్యులతో కలిసిపోయినట్టు కలిసిపోతాడు.

  • Written By: Vicky
  • Published On:
Rajinikanth – Balakrishna: సూపర్ స్టార్ రజినీకాంత్ – నందమూరి బాలకృష్ణ మల్టిస్టార్రర్ చిత్రం గురించి క్రేజీ అప్డేట్!

Rajinikanth – Balakrishna: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ప్రస్తుతం క్రేజీ మల్టీస్టార్ర్ర్ ప్రాజెక్ట్స్ హవా బాగా నడుస్తుంది. ఒక భాషలో సూపర్ స్టార్ గా వెలుగుతున్న ఒక హీరో, మరో భాషలో సూపర్ స్టార్ అయినా మరో హీరో ని పెట్టి మల్టీస్టార్ర్ర్ సినిమాలు తియ్యడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు.అలా చెయ్యడం వల్ల రెండు ఇండస్ట్రీల నుండి సంపూర్ణమైన ఓపెనింగ్స్ మరియు కలెక్షన్స్ వస్తుందని అలా చేస్తున్నారు.

అలా రీసెంట్ గా ఒక క్రేజీ మల్టీస్టార్ర్ర్ సినిమా ఖరారు అయ్యిందని అంటున్నారు. అసలు విషయానికి A కళ్యాణ్ అనే నూతన దర్శకుడు రెండు భాగాలుగా ఒక సినిమాని తియ్యబోతున్నాడట. ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు నందమూరి బాలకృష్ణ మరియు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారట. రీసెంట్ గానే కళ్యాణ్ ఈ ముగ్గురు హీరోలకు కథని వివరించి ఓకే చేయించుకున్నాడట.

బాలకృష్ణ కి అటు రజినీకాంత్ తో ఇటు శివరాజ్ కుమార్ తో దశాబ్దాల నుండి ఎంతో మంచి స్నేహం ఉంది. వీళ్ళిద్దరితో ఆయన తన సొంత కుటుంబ సభ్యులతో కలిసిపోయినట్టు కలిసిపోతాడు.ప్రస్తుతం శివరాజ్ కుమార్ రజినీకాంత్ తో కలిసి జైలర్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. రజినీకాంత్ సినిమా అంటే తెలుగు మరియు తమిళం ప్రేక్షకులతో పాటుగా హిందీ , కన్నడ మరియు మలయాళం ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఓవర్సీస్ లో అయితే రజినీకాంత్ కి ఉన్నంత మార్కెట్ ఎవరికీ లేదు.

మరోపక్క బాలయ్య వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని రీసెంట్ టైం లో సంపాదించుకున్నాడు.ఇక శివరాజ్ కుమార్ కర్ణాటక లో ఎంత పెద్ద స్టార్ హీరో అనేది మన అందరికీ తెలిసిందే. ఇలా ఈ ముగ్గురి కలయిక లో రాబోతున్న ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మొత్తాన్ని కొల్లగొడుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సంబంధిత వార్తలు