Cracked Heels: పగిలిన పాదాలు నాజుగ్గా మారే చిట్కా ఇంట్లోనే ఉంది.. ఎలాగో తెలుసుకోండి..
చలికాలంలో పాదాలు మాత్రమే కాకుండా మిగతా చోట్ల చర్మం పగుళ్లు ఏర్పుడుతంది. శరీరంలోని వేడి బయటకు వెళ్లే క్రమంలో ఇలా ప్రత్యేక ప్రదేశాల్లో పగుళ్లు ఏర్పడుతాయి.

Cracked Heels: కొందరికి చలికాలం రాగానే హాయిగా ఉంటుందనిపిస్తుంది. మరికొందరికి మాత్రం భయం వేస్తుంది. ఎందుకంటే వాతావరణం చల్లబడగానే వీరికి అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చలికాలంలో శరీరం లోపలి కంటే బయట అనేక అలర్జీలు వస్తుంటాయి. చర్మం పొడిబారడం.. చర్మం పగుళ్లు వంటి సమస్యలు వస్తుంటాయి. ఇక కొందరికి పాదాల మడిమలు పూర్తిగా ఎండినట్లుగా మారుతాయి. దీంతో పగుళ్లు ఏర్పడుతాయి. ఇలా పగుళ్లు ఏర్పడినప్పడు నడవడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఈ సమయంలో ఏం చేయాలో తోచదు. అయితే చిన్న చిట్కాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
చలికాలంలో పాదాలు మాత్రమే కాకుండా మిగతా చోట్ల చర్మం పగుళ్లు ఏర్పుడుతంది. శరీరంలోని వేడి బయటకు వెళ్లే క్రమంలో ఇలా ప్రత్యేక ప్రదేశాల్లో పగుళ్లు ఏర్పడుతాయి. కాళ్ల పగుళ్లు ఏర్పడడం చిన్న సమస్యే అనిపిస్తుంది. కానీ నడవడానికి తీవ్ర ఇబ్బంది అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కొన్ని అరటిపండ్లను తీసుకొని వాటి గుజ్జును ఈ పగుళ్లపై అప్లై చేయవచ్చు. దీంతో ఉపశమనం పొందుతాయి.
అరటిపండ్లలో విటమిన్ ఏ, విటమిన్ బీ 6 ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా అరటిపండ్లు సహకరిస్తాయి. దీని పేస్టును చర్మం ఎక్కడ పగిలినా 20 నిమిషాల పాటు ఉంచితే నయం అవుతుంది. పాదాల పగుళ్లు ఉన్న వారు ఇలా రెండు లేదా మూడు రోజుల పాటు చేస్తే పాదాలు నాజుగ్గా మారుతాయి. కేవలం పాదాల మీదనే కాకుండా పెదాలు, మడమల మీద కూడా అప్లై చేసుకోవచ్చు.
అరటి పండ్లతో పాటు వెనిగర్ కూడా పగుళ్ల నివారణకు సహకరిస్తుంది. వేడి నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేయాలి. ఈ నీటిలో పాదాలను నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పాదాలు ఎటువంటి సమస్యలకు గురికావు. అలాగే ఆలివ్ నూనె కూడా పాదల పగుళ్లను నివారిస్తుంది. ఆలివ్ ఆయిల్ ను పాదాలు పగిలిన చోట కూడా రాయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. అయితే బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చే టప్పుుడు పాదాలను శుభ్రం చేసుకోవాలి. పగిలిన పాదాల్లో మట్టి చేరడం వల్ల మరింత ఇబ్బంది పెడుతాయి.
