కాలిపోనున్న కరోనాసురుడు

భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. బాధితులను వేరుగా ఉంచడానికి తగిన స్థలాన్ని గుర్తించాలని, మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలుప్రాంతాలలోని ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా వున్నారు. అయితే ముంబైలో హోలిక దహన్ సందర్భంగా కరోనాసురుని దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు.హోలిక దహన్ సందర్భంగా ఈ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు. కరోనాసురుని చేతిలో […]

  • Written By: Neelambaram
  • Published On:
కాలిపోనున్న కరోనాసురుడు

భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కరోనా వైరస్ వల్ల తలెత్తిన పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షించారు. బాధితులను వేరుగా ఉంచడానికి తగిన స్థలాన్ని గుర్తించాలని, మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలుప్రాంతాలలోని ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా వున్నారు. అయితే ముంబైలో హోలిక దహన్ సందర్భంగా కరోనాసురుని దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు.హోలిక దహన్ సందర్భంగా ఈ దిష్టిబొమ్మను దహనం చేయనున్నారు.

కరోనాసురుని చేతిలో ఒక సూట్‌కేస్ ఏర్పాటు చేశారు. దానిపై ఆర్థిక మాంద్యం అని రాశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నుండి వచ్చిన తాజా అధికారిక సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,241 కొత్తగా కరోనావైరస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. దింతో మొత్తం అనుమానిత కేసుల సంఖ్య 95,333 కు చేరుకుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొన్న వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు మొత్తం 43 కరోనా వైరస్ నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. అయితే ముగ్గురు పాజిటివ్ రోగులు ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీ,యుపి, కేరళ,జమ్మూ కాశ్మీర్ లలో కొత్త కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు