కరోనా దెబ్బతో.. భారత అర్ధిక వ్యవస్థ కుదేల్

తెలుగులో ఒక సామెత ఉండేది.. ఏమిటంటే..”ఎంకి పెళ్ళి, సుబ్బి చావుకొచ్చిందట” ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచంలో దాదాపు 23 దేశాలకు పాకింది. అయితే చైనాలో ఉన్నంత ప్రభావం మన దేశంలో లేదు. కానీ, చైనాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని ప్రభావితం చేయొచ్చు. ఇప్పటికే ఈ కరోనా దెబ్బతో చైనా 15లక్షల కోట్ల మేర నష్టపోయిందని ఒక అంచన.   ప్రస్తుతం […]

  • Written By: Neelambaram
  • Published On:
కరోనా దెబ్బతో.. భారత అర్ధిక వ్యవస్థ కుదేల్


తెలుగులో ఒక సామెత ఉండేది.. ఏమిటంటే..”ఎంకి పెళ్ళి, సుబ్బి చావుకొచ్చిందట” ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచంలో దాదాపు 23 దేశాలకు పాకింది. అయితే చైనాలో ఉన్నంత ప్రభావం మన దేశంలో లేదు. కానీ, చైనాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని ప్రభావితం చేయొచ్చు. ఇప్పటికే ఈ కరోనా దెబ్బతో చైనా 15లక్షల కోట్ల మేర నష్టపోయిందని ఒక అంచన.

 

ప్రస్తుతం చైనా వృద్ధి రేట్ 6.1 శాతం, కరోనా దెబ్బతో 2 శాతం తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. 2002-03 మధ్య కాలంలో సార్స్ ప్రభలినప్పుడు చైనా వృద్ధిరేటు 1శాతం కంటే ఎక్కువగానే తగ్గింది. ఇటీవల కరోనా వైరస్ అంతకంటే ఎక్కువేగానే.. ప్రబలింది కాబట్టి చైనా ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారే అవకాశాలు లేకపోలేదు.

 

ఇక మనదేశం విషయానికి వస్తే.. చైనా కి భారత్ కి మధ్య వర్తకం విలువ 87 బిలియన్ డాలర్లు. దాదాపు 17 శాతం ఉత్పత్తులు చైనా నుంచే భారత్ కి వస్తాయి. ఫార్మా మెడిసిన్స్ కి సంబందించిన ముడి సరుకు, సోలార్ ఎనెర్జీకి సంబంధించిన పానెల్స్, మోడ్యూల్స్, ఆటోమొబైల్ కంపోనెంట్స్, స్మార్ట్ ఫోన్లు ఇలా అనేక రకమైన చైనా వస్తువులు భారత్ కి దిగుమతి అవుతున్నాయి. కరోనా దెబ్బతో చైనా, ఈ ఉత్పత్తికి చెందిన అనేక కంపెనీలు మూతపడ్డాయి. కరోనా కంట్రోల్ అయ్యి, ఆ కంపనీలు తెరువబడి, ఉత్పత్తి మొదలుపెట్టి భారత్ కి దిగుమతి చేయాలంటే.. ఎక్కువ సమయమే పడుతుంది. కాబట్టి భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు