కరోనా వైరస్:ఢిల్లీ, తెలంగాణలో రెండు కేసులు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, భారత్ లో కూడా అడుగపెట్టింది. దేశంలో కొత్తగా రెండు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రోగిలో ఒకరు న్యూ ఢిల్లీకి చెందినవారు, మరొకరు తెలంగాణకు చెందినవారు అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగులు ఇద్దరూ స్థిరంగా ఉన్నారని, నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది. ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇటలీ నుండి వచ్చాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి దుబాయ్ నుండి వచ్చాడని అధికారులు తెలిపారు. ఢిల్లీ, తెలంగాణ వాసులకు […]

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, భారత్ లో కూడా అడుగపెట్టింది. దేశంలో కొత్తగా రెండు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రోగిలో ఒకరు న్యూ ఢిల్లీకి చెందినవారు, మరొకరు తెలంగాణకు చెందినవారు అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగులు ఇద్దరూ స్థిరంగా ఉన్నారని, నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపింది.
ఢిల్లీకి చెందిన వ్యక్తి ఇటలీ నుండి వచ్చాడు. తెలంగాణకు చెందిన వ్యక్తి దుబాయ్ నుండి వచ్చాడని అధికారులు తెలిపారు.
ఢిల్లీ, తెలంగాణ వాసులకు ఈ కరోనావైరస్ సోకడంతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఏపీ తెలంగాణ వాసులకు కూడా ఈ కరోనా భయం పట్టుకుంది.
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90,000 మందికి సోకింది మరియు 3,000 మందికి పైగా మరణాలకు కారణమైంది, అందులో చైనాలోనే 2,912 మంది చనిపోవడం గమనార్హం.