చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ పేరు వింటే ప్రపంచం బెంబెలెత్తిపోతుంది. కరోనా వైరస్ క్రమంగా ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఇక్కడ.. అక్కడ అన్న తేడా లేకుండా 200పైగా దేశాల్లో కరోనా మహమ్మరి పాకింది. అయితే ఇప్పుడు ప్రపంచంలోని కరోనా సోకని దేశాలు ఏవైనా ఉన్నాయా? అని వెతికితే మాత్రం ఓ తొమ్మిది దేశాలు కరోనా ముప్పు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ దేశాలు కరోనాను కట్టడి చేయగలిగాయి. ఈ తొమ్మిది దేశాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఈ దేశాలపై ఓ లుక్కేద్దామా..
తుర్క్ మెనిస్తాన్: ఇది సెంట్రల్ ఆసియా దేశం. ప్రపంచలోనే నేచురల్ గ్యాస్ అధికంగా ఉన్న దేశాల్లో తుర్క్ మెనిస్తాన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ దేశంలో ‘కరోనా వైరస్’ అనే పదాన్నే నిషేధించారు.
తజికిస్తాన్: ఇది కూడా సెంట్రల్ ఆసియా దేశమే. తజికిస్తాన్ పెద్ద పెద్ద పర్వతాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హైకింగ్, క్లైంబింగ్ ఫేమస్. మార్చిలో మొదటి వారంలోనే తజికిస్తాన్లో 35దేశాల ఎంట్రీని నిషేధించింది. దీంతో కరోనాను కట్టడి చేయగలిగింది.
లెసోతో: ఇది సౌత్ ఆఫ్రికా దేశం. లెసోతో లో మంచుతో నిండిపోయిన పర్వతాలు ఉంటాయి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన సెహ్లాబాతేబ్ నేషనల్ పార్క్ ఇక్కడే ఉంది.
కొమోరోస్: ఇది ఈస్ట్ ఆఫ్రికా దేశం. కొమోరోస్ అగ్నిపర్వత ద్వీపాలను ‘సుగంధ ద్వీపాలు’ అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో సువాసలు వెదజల్లె మొక్కలు ఉండటం వల్ల ఈ పర్వతాలకు ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
సౌత్ సుడాన్: ఇది నార్త్ ఆఫ్రికా దేశం. ఈ దేశంలో అతిగొప్ప బయోడైవర్సీ ఉంది. ఆఫ్రికాలోని విభిన్న దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ జనాభా సుమారు 1.26కోట్లు.
యెమన్: ఇది మిడిల్ ఈస్ట్ దేశం. యెమన్ రెండో అతిపెద్ద అరబ్ దేశం. చాలాఏళ్లుగా ఇక్కడ అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఇక్కడ ఆకలి, వ్యాధులు వల్ల వేలాదిమంది చనిపోయారు.
బురుండి, మలావి: ఈ రెండు దేశాలు కూడా ఈస్ట్ ఆఫ్రికా దేశాలే. బురుండి వైల్డ్ లైఫ్, గ్రీనరికీ ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ, మాలావి సరస్సులు వెంట ఎత్తైన పర్వతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వన్యప్రాణులు, బీచ్ లకు మాలావి ప్రసిద్ధి.
నార్త్ కొరియా: ఇది ఈస్ట్ ఆసియా దేశం. ప్రపచంలోనే అత్యంత రహస్యమైన దేశం. ప్రభుత్వ టీవీ ప్రసారాల్లో తప్ప ఆ దేశంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అంత కఠిన నిబంధనలు ఈ దేశంలో అమలు అవుతాయని తెలుస్తోంది. చైనాలో కరోనా సోకిందగానే ఈ దేశమే తొలుత బోర్డర్లన్నీ మూసివేసింది. ఈ జాగ్రత్త చర్యలతోనే కరోనాను నివారించగలిగింది.