కరోనా అందరి జీవితాలను రోడ్డున పడేసింది. కోట్ల మంది ఉద్యోగాలు పోయాయి. ఉపాధి పోయింది. దీంతో ప్రభుత్వం ఇచ్చే రేషన్ తింటూ కలో గంజో తాగి బతికేస్తున్నారు. ప్రైవేటు టీచర్లు, ఉద్యోగులు అయితే ఉద్యోగాలు లేక పూట గడవక కూలినాలి చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇలా కరోనాతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. ముట్టుకుంటే అంటుకునే ఈ రోగాన్ని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు.
ఈ క్రమంలోనే సెక్స్ వర్కర్ల పరిస్థితి ఈ టైంలో ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఎందుకంటే అంటు వ్యాధి కావడంతో సెక్స్ వర్కర్ల ఉపాధిపై భారీగా దెబ్బపడింది. కరోనా భయానికి వీరివద్దకు కస్టమర్లు అస్సలు రావడం లేదట.. దీనిపై పరిశోధించిన ఓ సంస్థ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
ఇప్పటికే ఎయిడ్స్ వ్యాప్తి ప్రబలిన సమయంలోనూ ఇలానే సెక్స్ వర్కర్ల ఉపాధికి గతంలో భారీగా కోతపడింది. కండోమ్ లు వచ్చాక వారికి ఊరట లభించింది. కానీ ఇప్పుడు అంటుకునే కరోనాతో సెక్స్ వర్కర్లకు మొదట్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వారి దగ్గరకు కస్టమర్లు రాక పస్తులున్నారు.
ఇప్పుడు ఎయిడ్స్ కు కండోమ్ లాగా.. కరోనాకు రెయిన్ కోట్ ను ఉపయోగిస్తున్నట్టు ముంబైలో ఓ సెక్స్ వర్కర్ ఇటీవల ఓ మీడియాతో పంచుకున్నారు.ఇక ఫోన్ లో వీడియో కాల్స్ చేస్తూ కస్టమర్లను తృప్తి పరుస్తున్నారట.. ఇప్పుడు కొత్తగా ఫోన్ రోమాన్స్ పాపులర్ అయ్యిందట.. గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాక ఈ వీడియో కాల్ లో నగ్నంగా సెక్స్ వర్కర్లు సేవలందిస్తున్నారు. ముఖాన్నికనిపించకుండా ఈ పనిచేస్తున్నారు. వీడియో కాల్ కు రూ.500 వరకు వసూలు చేస్తున్నారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో కొందరు సెక్స్ వర్కర్లు గిరాకీ లేక పడుపు వృత్తికి పూర్తిగా స్వస్తి పలికారు. కస్టమర్లు రాలేదు. అయితే ఇప్పుడు అన్ లాక్ వేళ కరోనాను ఎదురించి వ్యాపారం మొదలు పెట్టారు. ఎయిడ్స్ ను కండోమ్ తో కంట్రోల్ చేసిన సెక్స్ వర్కర్లు.. రెయిన్ కోట్స్.. పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలతోపాటు ఆ పని కానిచ్చేస్తున్నారు. ఒక ఫోన్ రోమాన్స్ తోనూ ముంబై రెడ్ లైట్ ఏరియాల్లో ఉపాధి పొందుతున్నట్టు మీడియా సర్వేలో తేలింది. కరోనా వేళ సెక్స్ వర్కర్లు ఆకలిబాధలు తాళలేక ఇలా కొత్త ఐడియాలకు శ్రీకారం చుట్టి ఉపాధి పొందుతున్నారు.