కంగారుపెడుతున్న కరోనా..మోడీ కీలక సూచనలు

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనావైరస్ భారత్ లోకి కూడా అడుగుపెట్టడంతో దేశ వ్యాప్తంగా ప్రజలలో భయాందోళనలు ఎక్కువయ్యాయి. దింతో కోవిద్-19 వ్యాపించకుండా మోడీ సర్కార్ పలు సూచనలు, సలహాలను ఇస్తూ.. సత్వర వైద్య సహాయం అందించడం కోసం సంసిద్దమైంది. అందుకు సంబంధించిన శాఖలకు దిశా నిర్ధేశం చేస్తున్నాయి. “ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంకరంగా వ్యాపించిన నేపథ్యంలో ప్రశాంతంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని” దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సలహా ఇచ్చారు. కోవిద్-19 పరిష్కరించడానికి భారత అధికారుల […]

  • Written By: Neelambaram
  • Published On:
కంగారుపెడుతున్న కరోనా..మోడీ కీలక సూచనలు

ప్రపంచాన్ని చుట్టేస్తున్న కరోనావైరస్ భారత్ లోకి కూడా అడుగుపెట్టడంతో దేశ వ్యాప్తంగా ప్రజలలో భయాందోళనలు ఎక్కువయ్యాయి. దింతో కోవిద్-19 వ్యాపించకుండా మోడీ సర్కార్ పలు సూచనలు, సలహాలను ఇస్తూ.. సత్వర వైద్య సహాయం అందించడం కోసం సంసిద్దమైంది. అందుకు సంబంధించిన శాఖలకు దిశా నిర్ధేశం చేస్తున్నాయి.

“ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంకరంగా వ్యాపించిన నేపథ్యంలో ప్రశాంతంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని” దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సలహా ఇచ్చారు. కోవిద్-19 పరిష్కరించడానికి భారత అధికారుల సంసిద్ధతపై విస్తృతంగా సమీక్షించామని మోడీ చెప్పారు. భారతదేశానికి వచ్చిన ప్రజలను పరీక్షించడం నుండి సత్వర వైద్య సహాయం అందించడం వరకు వివిధ మంత్రిత్వ శాఖలు & రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయి ”అని మైక్రోబ్లాగింగ్ వెబ్‌ సైట్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో మోడీ అన్నారు.

దేశంలో రెండు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపిన విషయం విదితమే.. రోగిలో ఒకరు న్యూ ఢిల్లీకి చెందినవారు కాగా మరొకరు తెలంగాణకు చెందినవారు. ఆగ్రాలో కూడా మరో ఆరు అనుమానాస్పద కేసులను కనుగొన్నారు. పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుండి పరీక్ష ఫలితాల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి సోకింది అందులో 3,117 మంది చనిపోయారు.

సంబంధిత వార్తలు