కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు

దేశంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. దింతో ప్రజల భయాలను కొంతమంది వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు మొట్టమొదటి జాగ్రత్తగా ప్రజలు మాస్క్ లను ధరిస్తారు. ఈ మాస్క్ ధరని ఏకంగా 200రేట్లు పెంచారు వ్యాపారులు. గతంలో 100 మాస్క్ లు కలిగిన ఒక ప్యాకెట్ ధర రూ.150 నుంచి రూ.200గా ఉండేది కానీ ప్రస్తుతం ఒక్క మాస్క్ ధర రూ.30 నుంచి రూ 50 అంటే 100 మాస్క్ లు […]

  • Written By: Neelambaram
  • Published On:
కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు

దేశంలో కరోనా ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. దింతో ప్రజల భయాలను కొంతమంది వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా సోకకుండా ఉండేందుకు మొట్టమొదటి జాగ్రత్తగా ప్రజలు మాస్క్ లను ధరిస్తారు. ఈ మాస్క్ ధరని ఏకంగా 200రేట్లు పెంచారు వ్యాపారులు.

గతంలో 100 మాస్క్ లు కలిగిన ఒక ప్యాకెట్ ధర రూ.150 నుంచి రూ.200గా ఉండేది కానీ ప్రస్తుతం ఒక్క మాస్క్ ధర రూ.30 నుంచి రూ 50 అంటే 100 మాస్క్ లు గల ఒక ప్యాకెట్ ధర రూ.3000 నుంచి రూ.5000 కావడం విశేషం. ప్రస్తుతం కరోనా భయం వల్ల ధరతో సంబంధం లేకుండా ప్రజలు ఈ మాస్క్ లను కొంటున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సామాన్య ప్రజలపై మరింత ఆర్ధికభారం పడే అవకాశాలున్నాయని ప్రజలు వాపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం కలుగజేసుకొని సత్వర పరిస్కారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు